Tirupati Accident: తిరుపతిలొ దారుణ ఘటన చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యాన్ ఊడి పడి యువకుడికి తీవ్ర గామాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా నాగలాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. 1-బి, అడంగల్ దరఖాస్తు కోసం తండ్రితో కలిసి శివకుమార్ అనే యువకుడు తహసీల్ధార్ ఆఫీస్‌కి వచ్చారు.
దీంతో అకస్మాత్తుగా సీలింగ్ ఫ్యాన్ ఊడి శివకుమార్‌పై పడింది. ఫ్యాన్ తగలడంతో శివకుమార్ చెవికి గాయలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడి తండ్రి వెంకటేష్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్టు నాగలాపురం పోలీసులు తెలిపారు.
అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస పర్యవేక్షణ లేకపోవడంతోనే పాతబడిపోయిన ఫ్యాన్లు మరియు ఫర్నిచర్‌ను మార్చకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన వస్థువులను గ్రహించి వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని అక్కడి స్థానికులు తెలిపారు. ప్రస్థుతానికి యవకుడికి ఎలాంటి ప్రాణహని లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also read: YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!