E-Paper
Advertisement

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?
Advertisement

Ranabaali Movie: దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్న (Rashmika Mandanna),విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరో హీరోయిన్లుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి(Ranabaali). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు కొద్దిరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో దర్శక నిర్మాతలు సరికొత్త స్ట్రాటజీ ఉపయోగించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా విభిన్నంగా నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

4 ఎపిసోడ్లతో ప్రత్యేక డాక్యుమెంటరీ..

రణబాలి థియేటర్లలో విడుదల కావడానికి అంటే ముందుగానే ఈ సినిమా కథ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే రణబాలి సినిమాకి సంబంధించి నాలుగు ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ను ప్రేక్షకుల కోసం తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం జరిగిన పరిశోధన చారిత్రాత్మక నేపథ్యం సినిమా రూపుదిద్దుకున్న విధానాలు గురించి ఈ డాక్యుమెంటరీ ద్వారా నిర్మాతలు ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

నెవర్ ఫర్గెట్ ది ట్రూత్..

Advertisement

ఈ డాక్యుమెంటరీని రణబాలి “నెవర్ ఫర్గెట్ ది ట్రూత్” అనే పేరు మీద రూపొందించారు. 19వ శతాబ్దపు కాలంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో అప్పటి కరువు పరిస్థితులు, ప్రజల కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ నాలుగు ఎపిసోడ్లలో మొదటి ఎపిసోడ్ ది ఫెమైన్ వి ఫర్ గాట్ పేరు మీద సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కాబోతోంది. ఇక రెండవ ఎపిసోడ్ ది హిస్టరీ వి ఫర్ గాట్ సెప్టెంబర్ 30 తేదీ విడుదల కాబోతోంది. ఇక మూడవ ఎపిసోడ్ ది మెన్ వి ఫర్ గాట్ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇక నాలుగవ ఎపిసోడ్ ది లాస్ట్ లోడ్ అంటూ ఈ ఎపిసోడ్ విడుదల చేయబోతున్నారు.

Advertisement

ఇలా నాలుగు ప్రత్యేకమైన డాక్యుమెంటరీ సిరీస్ లతో ఈ సినిమాని విడుదలకు ముందే ప్రేక్షకులకు ఈ సినిమా కథను వివరించే ప్రయత్నం చేయటంతో ఈ సినిమా కథ ఏంటి అనేది ప్రేక్షకులలో ఒక అవగాహన ఉంటుంది తద్వారా సినిమాకు ఎలాంటి నెగెటివిటీ లేకుండా ప్లస్ పాయింట్ అవుతుందని చిత్ర బృందం భావించారు అందుకే సరికొత్తగా ఈ సినిమాకు డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు. మరి ఈ కొత్త స్ట్రాటజీ రణబాలి సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రజల కోసం అండగా నిలబడే యోధుడిగా విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణపాలి పాత్రలో కనిపించబోతున్నారు ఈయనకు భార్యగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో సందడి చేయబోతున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల కాబోతుంది.

Also Read: ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

Related News

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×