E-Paper
Advertisement

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!
Advertisement

Parvesh Verma: తిలక్ నగర్‌లో రోడ్డు తనిఖీ వివాదం సందర్భంగా స్థానిక యువకుడిని చెంపదెబ్బ కొడుతున్న వీడియోపై ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ స్పందించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తున్న వీడియో వెనుక ఉన్న నిజం మీరు తెలుసుకోవాలని అన్నారు. గత కొన్ని రోజులుగా వికాస్‌పురి రింగ్ రోడ్డుపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, కాంట్రాక్టర్‌కు తనను పరిచయం చేసి, తనకు కమీషన్ ఇప్పించాలని పీడబ్ల్యూడీ ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు..

ఆయన చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారని, మా ఇంజనీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తున్నారని అన్నారు. జర్నైల్ సింగ్‌కు ఎలాంటి కమీషన్ అందకపోవడంతో రాత్రి రోడ్డు వేసిన తర్వాత ఉదయాన్నే సైట్‌కు వెళ్లి దాన్ని తవ్వేసేవారని తెలిపారు. ఆ తర్వాత అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ వీడియోలు రికార్డ్ చేసి పోస్ట్ చేసేవారని, ఈరోజు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు, పనిని నేనే స్వయంగా తనిఖీ చేయాలనుకుంటున్నానని ఇంజనీర్లకు చెప్పానని అన్నారు.

Advertisement

Also read: వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

ఈ రోడ్డు 15 ఏళ్లుగా..

నేను ఆగి సైట్‌ను పరిశీలించినప్పుడు, పనులు చాలా బాగా జరుగుతున్నాయని చూశానని, ఈ రోడ్డు 15 ఏళ్లుగా నిర్మించలేదని స్థానికులు నాకు చెప్పారని అన్నారు. దశాబ్దన్నర కాలం తర్వాత ఎట్టకేలకు నిర్మాణం జరుగుతోందని అన్నారు. నేను స్వయంగా స్థానిక ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు మూడుసార్లు ఫోన్ చేశానని, ఆయన కోసం 45 నిమిషాలు ఎదురుచూశానని అన్నారు.

కుటుంబాన్ని తిట్టారు..

Advertisement

నేను మా పార్టీ కార్యకర్తలను ఎవరినీ ఆ ప్రదేశానికి పిలవలేదు. జర్నైల్ సింగ్ వచ్చినప్పుడు, ముందుగా సమాచారం అందుకున్న తన సొంత కార్యకర్తలతో వచ్చారని అన్నారు. వెంటనే దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారని, ఆయన కార్యకర్తలలో ఒకరు నా కుటుంబాన్ని తిట్టడం ప్రారంభించినప్పుడు, ఆవేశంలో ఎవరైనా ఎలా స్పందిస్తారో నేను కూడా అలాగే స్పందించానని అన్నారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పదలుచుకున్నాను మీరు సాధించలేకపోయిన దానిని మా ప్రభుత్వం ఈరోజు సాధిస్తోంది అందుకే అది మీకు ఇంత కడుపునొప్పిని కలిగిస్తోందని అన్నారు.

Also read: మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Tags

Related News

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×