Padi Kaushik Reddy : పోలీసు అధికారులపై దురుసు ప్రవర్తన, విధులకు ఆటకం కలిగించాంరటూ పోలీసుల కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా.. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంజిలిజెన్స్ విభాగం ఐడీ శివధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పెద్ద గొడవ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టారు. తన పార్టీ అనుచరులతో కలిసి ఈ నెల 4న బంజారాహిల్స్ పోలీసు ఠాణా వద్దకు వచ్చారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున నినాదులు చేసుకుంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
కౌశిక్ రెడ్డి, అతని అనుచరులు వచ్చిన సమయంలోనే తెలంగాణ సీఎం పర్యటన ఉండడంతో ముఖ్యమైన పనుల నిమిత్తం ఇన్ స్పెక్టర్ కే.ఎం. రాఘవేంద్ర బయటకు వెళుతున్నారు. పోలీసు స్టేషన్ ముందు బైటాయించిన కౌశిక్ రెడ్డి.. ఇన్ స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు రాఘవేంద్ర పై గోడవకు దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో.. ఆగ్రహించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని, అతని అనుచరుల్ని అక్కడి నుంచి పంపించేశారు. వాళ్లపై పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడం సహా బెదిరింపులకు దిగారనే కేసులు నమోదు చేశారు.
బంజారా హిల్స్ ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు బంజారాబిల్స్ ఠాణాలో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 25 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ పరశురాం విచారణ అధికారిగా ఉన్నారు. కాగా కేసులోని నిందుతులకు తాజాగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. వారిలో.. తెలంగాణ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు.
పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో విచారణ నోటీసులు అందించేందుకు ఎర్రోళ్ల శ్రీనివాస్ నోటీసులు ఇవ్వడానికి మారేడ్ పల్లిలోని ఇంటికి వెళ్లిన బంజారా హిల్స్ పోలీసులు వెళ్లగా.. ఇంట్లో నుంచి బయటికి రాలేదని తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటికి తరలివచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మాసబ్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదే సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ డివిజన్ పోలీసులు బుధవారం నోటీలుసు అందజేశారు. ఈనెల 27న వ్యక్తిగతంగా పోలీసు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. తొలుత కౌశిక్ రెడ్డికి వాట్సప్ ద్వారా మంగళవారం రాత్రి పోలీసులు నోటీసులు పంపారు. ఆయన స్పందించక పోవడంతో బుధవారం ఉదయం పోలీసు సిబ్బంది నేరుగా వెళ్లి కౌశిక్ రెడ్డికి నోటీసులు అందజేశారు.
Also Read :
కాగా.. వ్యక్తిగత పనుల కారణంగా ఈ నెల 27న హాజరు కాలేనని పోలీసులకు కౌశిక్ రెడ్డి తెలిపారు. మరోరోజు విచారణకు హాజరవుతానని చెప్పగా.. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా అందిస్తే పరిశీలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.