BigTV English

TTD : శ్రీవారి భక్తులకు సూపర్ పవర్స్.. టీటీడీ బంపరాఫర్

TTD : శ్రీవారి భక్తులకు సూపర్ పవర్స్.. టీటీడీ బంపరాఫర్

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దేవుడు కొలువైన పుణ్యక్షేత్రం. శ్రీవారి దర్శనంతో జన్మ చరితార్థం. ఏడుకొండలు నిత్యం భక్త కోటితో కళకళలాడుతుంటాయి. దర్శనం మధురానుభూతిని ఇస్తుంది కానీ.. సదుపాయాలే ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటాయి. గుండెల నిండా భక్తితో కొండ మీదకు వెళ్లే భక్తులకు పలు సమస్యలు వెంటాడుతుంటాయి. స్వామి వారికి తలనీలాలు సమర్పించాలంటే.. 100 ఇవ్వాల్సిందే. డబ్బులిస్తేనే గుండుపై గాట్లు పడవు. డిమాండ్ చేసి మరీ అడిగి తీసుకుంటారు అక్కడి క్షురకులు. దేవుడి సన్నిధిలో ఇలా పైసా వసూల్ ఏంటని అనుకోవడం మినహా ఏం చేయలేం.. వాళ్లతో వాదిస్తే గుండుపై రక్తం చూడాల్సిందే.


తిరుమలలో పైసా వసూల్

ఒక్క తలనీలాలనే కాదు.. గదులు ఖాళీ చేసే సమయంలోనూ అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. లగేజ్ లాకర్ల దగ్గరా అదే దోపిడీ. కొన్ని చోట్ల అపరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా టీటీడీ ఎంత మెరుగైన సౌకర్యాలు కల్పించినా.. ఇప్పటికీ కొండపై కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఎవరో సిబ్బంది చేసిన నిర్లక్ష్యానికి టీటీడీ మాట పడాల్సి వస్తుంది. ఆలయ ప్రతిష్టకు అవి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సమస్యలపై టీటీడీ పాలక మండలి దృష్టి పెట్టింది. అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? అనేది నేరుగా తెలుసుకోవాలని డిసైడ్ అయింది. అందుకే, భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతూ, వారికి మెరుగైన సేవలు అందించేందుకు.. వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం తీసుకొచ్చింది టీటీడీ.


వాట్పాప్‌లో భక్తుల ఫీడ్‌బ్యాక్ 

తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్‌ బోర్డులు పెడతారు. వాటిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే.. వాట్సాప్‌ ఓపెన్ అయి.. అందులో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీకి కనెక్ట్ అవుతుంది. అందులో భక్తులు తమ పేరు ఎంటర్ చేయాలి. టీటీడీకి చెందిన ఏ విభాగం గురించి ఫీడ్ బ్యాక్ ఇవ్వదలుచుకున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. క్యూలైన్, గదులు, కల్యాణకట్ట, లగేజీ, అన్నప్రసాదం, శుభ్రత, లడ్డూ ప్రసాదం, దర్శన అనుభవం ఇలా పలు కేటగిరీలు ఉంటాయి. అందులోంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వదలుచుకున్న ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

సేవలకు రేటింగ్

ఆప్షన్‌ క్లిక్ చేశాక.. మీ అభిప్రాయాన్ని టెక్ట్స్ లేదంటే వీడియా ఫార్మాట్ రూపంలో ఎంటర్ చేయవచ్చు. మీరు పొందిన సేవకు ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పొచ్చు. బాగుంది, బాగాలేదు, యావరేజ్, మెరుగుదల అవసరం.. ఇలా మీ ఫీడ్ బ్యాక్‌ ఎలా ఉందో తెలపాల్సి ఉంటుంది.

భక్తుల ఫీడ్‌బ్యాక్‌పై టీటీడీ యాక్షన్

టెక్ట్స్ రూపంలో అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే గరిష్టంగా 600 అక్షరాల వరకు టైప్ చేయవచ్చు. ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వెంటనే.. మీకు రిసీవ్డ్ మెసేజ్ కనిపిస్తుంది. ‘మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు’ అనే సందేశం వస్తుంది. ఇలా భక్తులు వాట్సాప్‌లో ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ అంతటిని టీటీడీ ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్తుంది. భక్తులు అందించిన సమాచారంతో.. సేవా ప్రమాణాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోనుంది టీటీడీ.

Also Read : శ్రీవారి దర్శనం.. ఈ టోకెన్స్ కోసం ఇలా చేయండి..

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×