BigTV English

Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena Candidate : గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు.. దాంతో మళ్లీ అక్కడ నుంచి తామే పోటీ చేస్తామంటున్నారు జనసైనికులు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకముందే రాజోలు నుంచి తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్‌‌కళ్యాణ్.. అలా కర్చీఫ్ వేశేసారు కాని.. కేండెట్‌ని మాత్రం ప్రకటించలేదు.. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు?.. అక్కడి ప్రజలు మళ్లీ ఆ పార్టీకి పట్టం కడతారా? రాజోలులో టీడీపీకి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు వర్గం ఆయనకి సహకరిస్తుందా ..? అన్న అంశాలు ఆసక్తికరంగా తయారయ్యాయి.

Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena : గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు.. దాంతో మళ్లీ అక్కడ నుంచి తామే పోటీ చేస్తామంటున్నారు జనసైనికులు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకముందే రాజోలు నుంచి తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్‌‌కళ్యాణ్.. అలా కర్చీఫ్ వేశేసారు కాని.. కేండెట్‌ని మాత్రం ప్రకటించలేదు.. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు?.. అక్కడి ప్రజలు మళ్లీ ఆ పార్టీకి పట్టం కడతారా? రాజోలులో టీడీపీకి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు వర్గం ఆయనకి సహకరిస్తుందా ..? అన్న అంశాలు ఆసక్తికరంగా తయారయ్యాయి.


కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2004 ఎన్నికల వరకు జనరల్ కోటాలో ఉన్న ఆ సెగ్మెంట్.. 2009 నాటికి ఎస్సీ రిజర్వ్‌డ్ అయింది.. ఆ సెగ్మెంట్ రిజర్వ్‌డ్‌‌గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు.. 2014లో కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో జనసేనలోకి వచ్చిన రాపాక రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. జనసేన గెలుచుకున్న ఏకైక స్థానం రాజోలే. అయితే గెలిచిన తర్వాత రాపాక వైసీపీకి జై కొట్టడంతో.. జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

నమ్మి గెలిపించుకున్న రాపాక పార్టీ ఫిరాయించడంతో రగిలిపోతున్నారు రాజోలు జనసైనికులు. ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్ధిగా మారిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజోలులో తన ఇమేజ్‌తోనే గెలిచానని.. పవన్‌కళ్యాణ్ గ్లామర్‌తో కాదని ప్రచారం చేసుకోవడం జనసేన అభిమానుల ఆగ్రహాన్ని మరింత పెంచేస్తోందంట. అందుకే రాజోలులో పవన్ అభిమానులు ఎలాగైన రాపాకపై గెలిచి తీరాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే రాజోలు నుంచి తమ అభ్యర్ధే పోటీ చేస్తారని ప్రకటించేశారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు కూడా మళ్లీ ఆ సీటు గెలుచుకుంటామని ధీమాతో కనిపిస్తోంది . జనసేన.. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తామంటున్నారు జనసైనికులు.


అయితే రాజోలులో జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యే రాపాక జనసేనకు దూరం జరిగాక.. రాజోలు జనసేన అభ్యర్ధిగా బొంతు రాజేశ్వరరావు పేరు ఫోకస్ అవుతోంది. ఆయన గత ఎన్నికల్లో రాజోలు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి జనసేనకు గట్టి పోటీ ఇచ్చి.. 814 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లోనూ ఆయన రాజోలు నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. తర్వాత రాపాక వైసీపీలోకి రావడంతో.. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ జనసేన టికెట్ రేసులోకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాద్, శేఖర్‌బాబుల కూడా జనసేన టికెట్ రేసులో కనిపిస్తున్నారు.

మరోవైపు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు టీడీపీ అభ్యర్ధిగా పోటీకి సిద్దమవుతున్నారు. తమ నేతలకు టీడీపీ టికెట్ కూడా కన్‌ఫర్మ్‌ అయిందని ఆయన అనుచరులు ఎప్పటి నుంచో ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని రాజోలు మాదే అని ప్రకటించడంతో గొల్లపల్లి శిబిరంలో టెన్షన్ కనిపిస్తోంది. ఇటు వైపు చూస్తే జనసేన అభ్యర్ధిపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. టికెట్ రేసులో ఒకరికి ముగ్గురు కనిపిస్తున్నారు.

అయితే రాజోలు టికెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామంటున్నారు జనసైనికులు .. రాపాకను ఓడించడమే తమ టార్గెట్ అని .. పొత్తులో భాగంగా సీటు ఎవరికి దక్కినా సమష్టిగా కృషి చేస్తామని చెప్తున్నారు .. అయితే రేపు సీట్ల సర్దుబాటులో రాజోలు జనసేన ఖాతాలోకి వెళ్లే .. టీడీపీ పరంగా గొల్లపల్లి సూర్యారావు వర్గం ఆ పార్టీకి ఎంతవరకు సహకరిస్తుందనేది సందేహమే అన్న టాక్ వినిపిస్తోంది .. మరి రాజోలులో పొత్తుల లెక్కలు ఆ పార్టీలకు ఎంతవరకు కలిసివస్తాయో చూడాలి.

Razole

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×