BigTV English

Iran | ఇరాన్‌లో నలుగురు మొసాద్ ఏజెంట్స్‌కు ఉరి.. ఒకే సంవత్సరంలో 600 మందికి మరణ శిక్ష!

Iran | నలుగురు ఇజ్రాయెల్ గూఢాచారులను ఇరాన్ ప్రభుత్వం సోమవారం, జనవరి 29న ఉరి తీసింది. ఈ నలుగరు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కోసం పనిచేసేవారని.. ఇరాన్‌ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు ఇరాన్ సుప్రీం కోర్టు గత సంవత్సరంలో ఈ నలుగురికి మరణ శిక్ష విధించింది.

Iran | ఇరాన్‌లో నలుగురు మొసాద్ ఏజెంట్స్‌కు ఉరి.. ఒకే సంవత్సరంలో 600 మందికి మరణ శిక్ష!

Iran | నలుగురు ఇజ్రాయెల్ గూఢాచారులను ఇరాన్ ప్రభుత్వం సోమవారం, జనవరి 29న ఉరి తీసింది. ఈ నలుగరు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కోసం పనిచేసేవారని.. ఇరాన్‌ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు ఇరాన్ సుప్రీం కోర్టు గత సంవత్సరంలో ఈ నలుగురికి మరణ శిక్ష విధించింది.


చనిపోయిన నలుగురు మొసాద్ ఏజెంట్స్.. ఇరాన్ డిఫెన్స్ మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని బాంబుతో పేల్చేందుకు కుట్ర చేస్తుండగా పట్టుబడ్డారని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. వీరంతా ఇరాక్ దేశంలోని కుర్దిస్తాన్ ప్రదేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తూ.. ఇరాన్‌లో దొంగచాటుగా ప్రవేశించారని మీడియా వెల్లడించింది.

గత రెండు దశాబ్దాలుగా.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఇరాన్‌ అణు శక్తి దేశంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను ఇజ్రాయెల్ మొసాద్ గూఢాచారులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ఇరాన్‌ నిపుణులు, శాస్తవేత్తలను చంపేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ అంతర్జాతీయ వేదికలపై మండిపడుతోంది. పైగా గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుధ్దం కారణంగా ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్‌ను పోరాడుతున్న హమాస్, లెబనాన్ హెజ్బుల్లా, యెమెన్ హౌతీ విద్రోహులకు పరోక్షంగా ఇరాన్ సహాయం చేస్తోందని ఆరోపణలు కూడా ఉన్నాయి.


ఈ క్రమంలో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థకు చెందిన నలుగురు మొసాద్ ఏజెంట్స్ గత సంవత్సరం పట్టుబడ్డారు. ఇరాన్ సుప్రీం కోర్టు ఈ నలుగురికి ఉరిశిక్ష విధించింది. ఇటీవలే ఒక మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. అతడిని కూడా ఇరాన్ ఉరితీసింది. తమ దేశంలో దొంగచాటుగా ప్రవేశించి తమ దేశ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులను మొసాద్ ఏజెంట్స్ హత్య చేస్తున్న కారణంగా.. వారిని కఠిన శిక్షించాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో ఇరాన్‌లో 600 మందిని ఉరితీశారు.

భారత దేశంలో అయితే దేశానికి వ్యతిరేకంగా గూఢాచర్యం చేసిన వారిని కేవలం 7 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. ఇరాన్‌తో పాటు పలు ముస్లిం, పాశ్చాత్య దేశాలు.. గూఢాచర్యాన్ని తీవ్ర నేరంగా పరిగణించి ఉరిశిక్ష విధిస్తాయి.

Tags

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×