BigTV English

Kurupam Assembly Constituency : కురుపాంలో పుష్పశ్రీవాణి విక్టరీ సాధిస్తారా? హ్యాట్రిక్ ఖాయమా?

Kurupam Assembly Constituency : కురుపాంలో పుష్పశ్రీవాణి విక్టరీ సాధిస్తారా? హ్యాట్రిక్ ఖాయమా?

Kurupam Assembly Constituency : ఉత్తరాంధ్రలో మారుమూల ప్రాంతమైనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం కురుపాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయ రామరాజు ఇక్కడి నుంచి ఎన్నికైన నేతలే. ఈ నియోజకవర్గం పేరుకే గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానం అయినా మిగిలిన సామాజికవర్గాలు కూడా అదేస్థాయిలో గెలుపోటములను శాసిస్తాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో శ‌త్రుచ‌ర్ల కుటుంబం తొలి నుంచి రాజ‌కీయంగా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది. శ‌త్రుచ‌ర్ల ఆరుసార్లు ఎమ్మె ల్యేగా గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన జ‌నార్ధన థాట్రాజ్ 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీలో చేరారు. ఈయ‌న 2014 ఎన్నిక‌ల ముందు శ‌త్రుచ‌ర్లతో క‌లిసి టీడీపీలో చేరారు. కానీ 2014 నుంచి సీన్ మారిపోయింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గడచిన రెండు ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి వరుసగా గెలిచారు. జగన్ కేబినెట్ 1.0 లో ఉప ముఖ్యమంత్రి పనిచేశారు. పుష్ప శ్రీవాణిని ఢీకొట్టేందుకు తోయక జగదీశ్వరి.. వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ సై అంటే సై అంటున్నారు. మరి వీరిలో ఎవరెవరు బరిలోకి దిగితే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? వాటికి గల కారణాలేంటి? అన్న అంశాలపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను తెలుసుకునే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓ సారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
పాముల పుష్ప శ్రీవాణి( గెలుపు) vs ప్రియా థాట్రాజ్
YCP 52%
TDP 34%
CPM 6%
OTHERS 8%

2019 ఎన్నికల్లో గెలుపు వైసీపీనే వరించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించారు పుష్ప శ్రీవాణి. ఆ ఎన్నికల్లో ఆమె ఏకంగా 52 శాతం ఓట్లు సాధించారు. ఇక టీడీపీ బరిలోకి దింపిన ప్రియా థాట్రాజ్‌ 34 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చిన హామీలను విపక్షంలో ఉన్నా నెరవేర్చడంతో ప్రజలు ఆమెకు మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు. ఇక సీపీఎం నుంచి బరిలోకి దిగిన అవినాష్‌ కుమార్ కూడా 3 శాతం ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు రెండు కూడా నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేటాయించాయి. 2014 ఎన్నికలతో పోల్చితే వైసీపీ, టీడీపీ ఓట్‌ షేర్‌ గణనీయంగా పెరగగా.. సీపీఎం ఓట్‌ షేర్‌ మాత్రం అదే స్థాయిలో పడిపోయింది. అయితే ఇదంతా గతం. మరి ఈ ఎన్నికల్లో ఎవరి గెలుపోటములు ఎలా ఉంటాయన్న దానిపై బిగ్‌ టీవీ నిర్వహించిన ఎలక్షన్‌ సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.


ముందుగా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగననున్న పాముల పుష్ప శ్రీవాణికి కలిసొచ్చే అంశాలేంటి.. ప్రతికూలించే విషయాలేంటో చూద్దాం.

పాముల పుష్ప శ్రీవాణి (YCP) ప్లస్ పాయింట్స్

  • కలిసి రానున్న రాజకీయ కుటుంబ నేపథ్యం
  • నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉండటం
  • నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండటం
  • బలమైన అపోజిషన్ లేకపోవడం
  • బలంగా సపోర్ట్‌ చేసే క్యాడర్ ఉండటం
  • గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం
  • ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడంలో విజయం

పాముల పుష్ప శ్రీవాణి మైనస్ పాయింట్స్

  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలం
  • డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో అభివృద్ధి చేయలేకపోయారనే ఆరోపణలు
  • శత్రుచర్ల కుటుంబంలోని అంతర్గత విబేధాలు
  • ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బతినడం
  • పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం, ఇసుక అక్రమ తవ్వకాల్లాంటి వ్యవహారాలు

తోయక జగదీశ్వరి (TDP) ప్లస్ పాయింట్స్

  • మొదటి నుంచి టీడీపీతోనే ఉండటం
  • శతృచర్ల విజయ రామరాజు బలమైన మద్దతు

తోయక జగదీశ్వరి మైనస్ పాయింట్స్

  • ప్రజల్లో అంత బలమైన గుర్తింపు లేకపోవడం
  • టికెట్ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం
  • కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో మద్ధతు దక్కడంపై అనుమానాలు

వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ (TDP) ప్లస్ పాయింట్స్

  • కలిసి రానున్న తండ్రి వైరిచర్ల కిషోర్‌ చంద్ర రాజకీయ నేపథ్యం

వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ మైనస్ పాయింట్స్

  • రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టడం
  • నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గుర్తింపు లేకపోవడం
  • వైసీపీ అభ్యర్థికి బలమైన పోటీ ఇస్తారని ప్రజలు భావించకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో కురుపాం బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

పాముల పుష్ప శ్రీవాణి vs తోయక జగదీశ్వరి
YCP 54%
TDP 39%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు కురుపాంలో ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణికి 54 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. ఇక టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తే కేవలం 39 శాతం ఓట్లు మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెబుతోంది.

మొత్తంగా చూస్తే పుష్ప శ్రీవాణికి చాలా అంశాలు అనుకూలంగా ఉన్నాయి. బలమైన కుటుంబ నేపథ్యంతో పాటు.. డిప్యూటీ సీఎంగా పనిచేసి ఉండటం.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు.. టీడీపీలో ఉన్న మామ శతృచర్ల విజయ రామరాజు ఇన్‌డైరెక్ట్ సపోర్ట్‌ కూడా ఆమెకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. దీనికి తోడు టీడీపీ అభ్యర్థి అంత బలంగా లేకపోవడం కూడా వైసీపీ మరింత కలిసి రానుంది.

నిజానికి ఈ నియోజకవర్గంలో వైసీపీకి మద్ధతిచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వాలంటీర్‌ వ్యవస్థ కూడా ఈ నియోజకవర్గంలో చక్కని ఫలితాలను ఇచ్చింది. మారుముల ప్రాంతాలతో పాటు.. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా వాలంటీర్లు వెళ్లి సేవలందించడంపై ఇక్కడ చాలా పాజిటివ్‌ రెస్పాన్స్ ఉంది.

అయితే టీడీపీకి కూడా ఇక్కడ ఓటు బ్యాంక్‌ గట్టిగానే ఉందని చెప్పాలి. పుష్ప శ్రీవాణి పనితీరు నచ్చని వారంతా టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.పూర్ణపాడు బ్రిడ్జ్‌ పూర్తికాకపోవడంతో కొంతమంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు.నియోజకవర్గ ప్రజల్లో రెండో స్థానంలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో ఒకరైన దట్టి లక్ష్మణ్‌ రావు టీడీపీకి మద్ధతు తెలుపుతున్నారు.

మొత్తం ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే కురుపాంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది.

.

.

Related News

AP Bar License: బార్ల లైసెన్స్ పై.. సీఎం చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న‌ నిర్ణ‌యం

Post Office Collapse: పోస్ట్ ఆఫీసులో ఊడిపడ్డ పైకప్పు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు

Amaravati Capital: సజ్జల నోరు జారారా? నిజం చెప్పారా? లేక జగన్ కి కోపం తెప్పించారా?

RK Roja: యాంక‌ర్ వా.. మంత్రివా? అనితపై రెచ్చిపోయిన రోజా

YSR Congress Party: తీవ్ర విషాదం.. వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి..

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Big Stories

×