BigTV English

Union minister Ram mohan naidu: ఏపీలో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Union minister Ram mohan naidu: ఏపీలో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Union minister Ram mohan naidu Comments on New airports in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు మరో ఏడు కలిపి 14కు విస్తరించనుంది. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయకుడు కీలక ప్రకటన చేశాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకుడు, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.


ఏపీలో విమానయాన రంగ అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులకు వివరించారు. అలాగే ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఈ మేరకు ఏపీలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై కేంద్ర మంత్రి మాట్లాడారు.

ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే..తమ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించినట్లు మంత్రి వివరించారు. అలాగే శ్రీశైలం, ప్రకాశంచ బ్యారేజ్ లో సీ ప్లేన్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.


Also Read: ప్రధాని మోదీతో ఏపీ సీఎం కీలక భేటీ.. సమావేశం అనంతరం చంద్రబాబు..

కొత్తగా ఏర్పాటు చేసే విమానాశ్రయాల్లో తొలుత శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ లను అభివృద్ధి చేయాలని గుర్తించామని మంత్రి అన్నారు. ఆ తర్వాత తుని అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో ఉన్న అవకాశాలను అధ్యయన చేస్తామన్నారు. ఇక, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్ పోర్టును ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×