BigTV English

Vallabhaneni Janardhan : టాలీవుడ్ లో మరో విషాదం ..ఆ నటుడు ఇకలేరు..

Vallabhaneni Janardhan : టాలీవుడ్ లో మరో విషాదం ..ఆ నటుడు ఇకలేరు..

Vallabhaneni Janardhan : తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతిరావు మృతిని మరువకముందే మరో నటుడు కన్నుమూశారు. సీనియర్‌ నటుడు వల్లభనేని జనార్దన్‌ (63) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


విజయవాడకు చెందిన జనార్దన్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. కాలేజీ రోజుల్లోనే పలు నాటకాల్లో కీలకపాత్రలు పోషించారు . కళాశాల చదువు పూర్తైన వెంటనే ‘కళామాధురి’ అనే నాటక సంస్థను స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దర్శక, నిర్మాత విజయ బాపినీడు మూడో కుమార్తెను ఆయన వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. కుమారుడు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

తన మామ విజయబాపినీడు తెరకెక్కించిన ‘గ్యాంగ్‌లీడర్‌’లో జనార్ధన్ పోలీస్‌ అధికారిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. ‘అన్వేషిత’ సీరియల్స్‌ జనార్ధన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన కొన్నిసినిమాలకు దర్శక, నిర్మాతగాను వ్యవహరించారు.


దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన వల్లభనేని జనార్ధన్ మెగాస్టార్‌ చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో చేసిన పాత్రకు బాగా పేరొచ్చింది. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్దన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’, నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీఎస్‌’ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన మరణంపై టాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×