Vallabhaneni Vamsi: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వైసీపీ నేత వల్లభనేని వంశీని ఈరోజు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. గురువారం వాంతులు, విరోచనాలతో నీరసంగా ఉండటంతో వంశీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మూడురోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ లో ఆయనకు ట్రీట్మెంట్ అందుతుంది.శనివారం రాత్రి కూడా వంశీకి కొంత హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నేడు పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి సబ్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. జైలు నుంచి బయటకొస్తారా? లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. అనారోగ్య కారణాల దృష్ట్యా.. వంశీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వాయిదా వేసిన ధర్మాసనం.. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలకు.. ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటునిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. వల్లభనేని వంశీ.. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండటంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని హైకోర్టు ఆదేశించింది.
వంశీ ఆరోగ్య విషయంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కూడా వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. టెస్టులు జరపగా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్సన్ వల్ల నీరు చేరినట్లు గుర్తించారు. కోలుకున్న తర్వాత జూన్ 2న డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: కార్యకర్తల నుంచి వైసీపీకి సెగ.. మంత్రి లోకేష్‌కు అంబటి వార్నింగ్
వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్లిన తర్వాత.. వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో.. మెరుగైన వైద్య చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆదేశిస్తూ.. వంశీకి కొంత ఊరటనిచ్చింది.
వల్లభనేని వంశీపై మొత్తం 6 కేసులు నమోదవగా.. 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే.. నకిలీ ఇళ్లపట్టాల కేసులో జూన్ నెలాఖరు వరకు వంశీ రిమాండ్‌ని పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ కేసులోనూ బెయిల్ రావాల్సి ఉన్నందున.. ఆయన జైలు నుంచి పూర్తిగా విడుదలయ్యేందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.