Vallabhaneni Vamsi : విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఇప్పటికే ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. కొంతకాలంగా ఊపిరి తీసుకోవడానికి, మాట్లాడేందుకు కూడా కష్టంగా ఉందని వివరించారు. వంశీని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాలని పోలీసులకు ఎస్సీ ఎస్టీ కోర్టు సూచించింది. వంశీ తరపున న్యాయవాదిని తన ఆరోగ్యంపై మెమో దాఖలు చేయాలని ఆదేశించింది.
వంశీకి బెయిల్.. కానీ…
మరోవైపు, ఇదే సమయంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కాస్త రిలీఫ్ దక్కింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు అయింది. ఎస్పీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో.. మూడోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 89 రోజులు జైల్లో ఉన్నారు వంశీ. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ వచ్చింది. అయితే, వంశీపై మరో నాలుగు కేసులు కూడా ఉండటంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
వల్లభనేనిపై చార్జిషీట్
అటు, వంశీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని చార్జ్‌షీట్‌లో తెలిపారు. కేసు వెనక్కి తీసుకున్నట్లు అఫిడిట్‌పై సంతకాలు చేయించారని.. కోర్ట్‌కు తీసుకెళ్లి స్టేట్‌మెంట్ ఇప్పించారని చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. 59 మంది సాక్షులుగా ఉన్న ఈ కేసులో నిందితులపై గన్నవరం అత్కూర్ పీఎస్‌లో 17 కేసులు ఉన్నాయని.. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.
Also Read : జవాన్ ఆర్థిక సాయంపైనా రాజకీయమేనా జగన్?
నో రిలీఫ్..
వంశీపై చార్జిషీట్ నమోదు కావడం, జైల్లో అస్వస్థతకు గురి కావడం, వల్లభనేనికి బెయిల్ రావడం.. అయినా బయటకు వచ్చే ఛాన్స్ లేకపోవడం.. వరుస పరిణామాలతో వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. దాదాపు 3 నెలలు జైల్లో ఉండాల్సి రావడంతో వంశీ శారీరకంగా, మానసికంగా బాగా కృంగిపోయారని చెబుతున్నారు. ఆయన అవతారం కూడా పూర్తిగా మారిపోయింది. తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, బలహీన శరీరంతో చాలా వీక్‌గా కనిపిస్తున్నారు. రెడ్ బుక్ దెబ్బ ఆయనకు గట్టిగానే తగిలింది. జగన్ హయాంలో రెచ్చిపోయినందుకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా వెంటాడుతున్నాయి. ప్రస్తుతం బెయిల్ రావడం కూడా ఆయనకు ఊరట ఇవ్వలేక పోతోంది. వంశీని వదిలేదేలే అంటూ నారా లోకేశ్ గట్టిగా ఫిక్స్ అయ్యారనేది ఓపెన్ టాక్.