BigTV English

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..

Tirumala : తిరుమలలో మరోసారి విజిలెన్స్ భద్రతా వైఫల్యం బయటపడింది. అలిపిరి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. తిరుమల- తిరుపతి మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్‌ కెమెరాతో శేషాచల కొండలను చిత్రీకరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీటీడీ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు.


సాధారణంగా భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఎగురవేయడానికి అనుమతించరు. భక్తులు వాహనాల్లో తిరుమలకు చేరుకునే సమయంలో అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి కొండపైకి పంపిస్తారు. కానీ ఘాట్‌రోడ్డుపై డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా భద్రతా వైఫల్యమని భక్తులు టీటీడీ అధికారులపై మండిపడుతున్నారు.

.


.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×