BigTV English

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.


రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతును నిర్మించారు. ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ఇప్పటివరకు రెండు గంటల సమయం పడుతోంది. అటల్ సేతు ద్వారా ఆ దూరాన్ని 15- 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు . అందులో 16 కిలోమీటర్లలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకొనేలా ఈ వంతెన నిర్మాణం సాగింది. అటల్ సేతు నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ప్రయోగించారు.

మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోను నిర్వహించారు. 2 కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద మోదీ పూజలు చేశారు. రోడ్‌షోలో మోదీతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఉన్నారు.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×