Satyabhama Today Episode December 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కోసం నరసింహ మీడియం తీసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాదేవయ్య రిపోర్ట్ ను తాను తీసుకొచ్చిన డాక్టర్ ఓపెన్ చేయాలని అంటాడు. ఇక భైరవి అలాగే తీసుకో అందులో ఏముంటుందో ఈ ప్రపంచానికి తెలిసేలా చెప్పని డాక్టర్కి ఇస్తుంది. ఇక డాక్టరు మహదేవయ్య ఎక్కువ గంగకు ఎటువంటి సంబంధం లేదని చెప్తారు. ఇక క్రిష్ మహదేవయ్య కొడుకు అని డాక్టర్ చెప్తాడు. దాంతో నరసింహతో పాటు సత్య కూడా షాక్ అవుతుంది. భైరవి సంతోషంలో మునిగి గంతులు వేస్తుంది. ఇక మహదేవయ్య సత్య ఇంట్లోకి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. మహదేవయ్య వచ్చేసి నిజం పాతి పెట్టేసావు నీ నోటితో నువ్వే నేను క్రిష్కి తండ్రినని నిజాన్ని బయట పెట్టావని మహాదేవయ్య విర్రవీగుతాడు. ఇలా నువ్వు ఎంతమంది గంగల్ని తీసుకొచ్చిన గంగలో మునిగిపోతారు అంతే అనేసి అంటారు. సత్యకు హాస్పిటల్ లోని కాంపౌండర్ ఫోన్ చేస్తాడు. ఆ డెలివరీ టైమ్ లో ఒక నర్స్ ఉండేది తర్వాత రోజు రిజైన్ చేసింది ఆ నర్స్ అడ్రస్ నాకు దొరికింది ఆమెను అడగండి అని చెప్తాడు. ఆమెను వెతికి అసలు నిజం బయట పెట్టాలని సత్య అనుకుంటుంది. ఎవరికీ తెలియకుండా బయటకు వస్తుంది. క్రిష్ చూస్తాడు. ఇద్దరు కలిసి నర్స్ ను వెతకడానికి వస్తారూ.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య, క్రిష్ లు సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. క్రిష్ సెటైర్లకు, సత్య కౌంటర్స్ వేస్తుంది. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ కార్లో వెళ్తూ ఉంటారు. ఇక గంగ గురించి కృష్ణ తడబడుతుంది. ఆమె నీకు చెడు ఏం చేయలేదు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఆమె గురించి మర్చిపోవచ్చు కదా అనేసి సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం ఆమె వెనకాల ఎవరో ఉన్నారు లేకుండా మాత్రం ఆమె ఇలా చేయదు అనేసి అంటాడు. నీ జన్మ రహస్యం గురించి నిజం తెలుసుకోవాలని ఇదంతా చేశాను ఇక నీకు త్వరలోనే ఆ నిజం తెలిసిపోతుందని సత్య అంటుంది.. ఇక సంధ్య సంజయ్ బైక్ మీద వెళ్తుంటే సత్య చూస్తుంది. ఎవరితోనూ బైక్ మీద వెళ్తుందనేసి క్రిష్ కు చెప్పగానే కాల్ చేయమని చెప్తాడు. సందీప్ కి ఫోన్ చేస్తే నేను కంప్యూటర్ క్లాస్ లో ఉన్నానని అబద్ధం చెప్తుంది. మహానటి లాగ నటించేసావుగా నిజం తెలిసిపోతుంది అని ఇలా నటించావని సంజయ్ అంటాడు.
ఇక క్రిష్ సత్య ఇద్దరు నడుచుకుంటూ వెళ్లిపోతారు. నీ జన్మ రహస్యం నీ ముందరే విప్పేలా చేస్తానని మనసులో అనుకుంటుంది. ఇక అంతలోపే మహదేవయ్య మనుషులు అక్కడికి వచ్చి మేరీని బలవంతంగా తీసుకెళ్లి పోతారు. ఇక సత్య క్రిష్ అక్కడికొస్తారు.. అక్కడ ఒక ఆవిడను అడిగితే బలవంతంగా ఎవరూ ఎత్తుకెళ్తున్నారు అనేసి చెప్తుంది.. ఇక సత్య కృష్ణ లు గురించి వెళ్లిపోవాలనిసి అనుకుంటారు. ఇక మేరీ దొరకలేదని సత్య ఫీల్ అవుతూ ఉంటుంది. మహదేవయ్యా పని ఇదంతా అనేసి సత్య అనుకుంటుంది. ఇప్పుడు నీ మీద సత్య క్రిష్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు.. ఇక క్రిష్ ని హనీమూన్ కి వెళ్దామని సత్య అంటుంది. క్రిష్ బాపు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యాక మనం వెళ్దామనేసి అంటాడు. ఇక మైత్రి రెడీ అవ్వలేదని హర్ష పిలుస్తాడు. ఇక మైత్రికి సర్ప్రైజ్ చేస్తాడు హర్ష. మేడపై అందంగా బర్త్డే సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేస్తాడు.. ఇద్దరూ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మునిగిపోతారు. హర్షకు అప్పుడే ఫోన్ వస్తుంది. నందిని వెయిట్ చేస్తుందని హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కోపంతో మైత్రి రగిలిపోతుంది.
ఇక క్రిష్ సత్యలు ఇంటికి వస్తారు. క్రిష్ తినడానికి ఇష్టపడడు. ఇక మహదేవయ్యా నాకోసమే వెయిట్ చేస్తున్నావని సత్యం అంటాడు. నేను చేసిన పాపం ఆ నర్స్ చూసింది ఆ నర్స్ ని అప్పుడే ఉద్యోగం వదిలేసి పారిపొమ్మని చెప్పాను. కానీ అప్పుడు వదిలేసినదే ఇప్పుడు ఇంత మహాపాపం అవుతుందని నేను అనుకోలేదు అందుకే ఆ నర్స్ ని ఇక భూమి మీద కనిపించకుండా చేసేసాను అనేసి అంటాడు. నేను కూడా మీకు అడ్డుపడుతున్నాను కదా నా గురించి మీరు ఆలోచించలేదు ఏంటి అనేసి అంటుంది సత్య. దహనం నశించినప్పుడు నీకు కూడా నర్సుకు పట్టిన గతే పడుతుంది అని అంటాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పేంతవరకు నా ప్రాణాలైనా లెక్క చేయనని సత్యం మహదేవయ్యకు చాలెంజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..