Vijayasai reddy on Jagan: తన పదవులకు, పార్టీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి ఇప్పడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆయన, సైలెంట్ గా ఉంటారని అందరూ భావించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఆయన చెప్పినట్లు వ్యవసాయం చేసుకుంటారు అనుకున్నారు. కానీ, ఆ పార్టీ నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేక, ఇస్తే ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నారు.
జగన్ కోటరీపై విజయసాయిరెడ్డిపై విమర్శలు
జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ ఉందన్న విజయ సాయిరెడ్డి, ఆ కోటరీ వల్లే తాను దూరం కావాల్సి వచ్చిందన్నారు. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్ కు చెప్పినా, ఆయన తన మాట వినలేదన్నారు. తనకు, జగన్ కు విభేదాలు సృష్టించింది కోటరీలోని వాళ్లే తనను విమర్శించినట్లు చెప్పారు. తాజాగా మరోసారి జగన్ టార్గెట్ గా సటైర్లు వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. “పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!” అని రాసుకొచ్చారు.
పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 15, 2025
ఇక రీసెంట్ గా మళ్లీ ఆయన వైసీపీలో చేరుతాడని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చా.. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు.. నేను వైసీపీలో చేరను” అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయనని జగన అన్నారని, కానీ, ఏ ప్రలోభాలకు లొంగలేదన్నారు.
విజయ సాయిరెడ్డిపై మాజీ మంత్రుల విమర్శలు
అటు విజయసాయిరెడ్డి చేసిన కోటరీ కామెంట్స్ పై పలువురు మాజీ మంత్రులు స్పందించారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక బురద జల్లడం కామన్ అన్నారు మాజీమంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీలో కోటరీ ఉందంటే, అది విజయసాయి రెడ్డే అన్నారు. తనకు తెలిసి ఏ కోటరీ లేదన్నారు. ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి, కోటరీ కూడా వెళ్లిపోయినట్టేనన్నారు. విజయ సాయిరెడ్డి వైసీపీ మీద బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిదికాదన్నారు.
అటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఏ కోటరీ లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే అన్నారు. అయినా, కోటరీ లేని రాజకీయ పార్టీ ఏదీ లేదన్నారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న ఆయనే.. ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించలేం అన్నారు.
ముందు నుయ్యి, వెనుక గొయ్యి!
అటు విజయ సాయిరెడ్డిపై విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక వేళ సాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తే వైసీపీకే నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివాదం ముదిరితే జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్ గా కూడా మారే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారు. అదే, జరిగితే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోవడం ఖాయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి విషయంలో వైసీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Read Also: చెత్త ఎత్తిన చంద్రబాబు, శభాష్ అంటూ నెటిజన్ల ప్రశంసలు