BigTV English

Samantha: నిర్మాతగా మారిన సమంత.. గ్రాండ్‌గా మొదటి సినిమా అనౌన్స్‌మెంట్..

Samantha: నిర్మాతగా మారిన సమంత.. గ్రాండ్‌గా మొదటి సినిమా అనౌన్స్‌మెంట్..

Samantha: ఈరోజుల్లో హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా వెండితెరపై తమ యాక్టింగ్‌కు గుర్తింపు రాగానే వేర్వేరు విభాగాల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో తామేంటో నిరూపించుకోవాలని హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సౌత్, నార్త్ అని తేడా లేకుండా చాలామంది హీరోయిన్లు నిర్మాతలుగా కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సమంత కూడా వారినే ఫాలో అవ్వనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా తను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టుగా అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఇక ఆ నిర్మాణ సంస్థ నుండి మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యిందని సామ్ స్వయంగా ప్రకటించింది.


ఏడాది తర్వాత అప్డేట్

సమంత (Samantha) పుట్టినరోజు సందర్భంగా.. అంటే 2024 ఏప్రిల్ 28న తను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టుగా ప్రకటించింది. త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తను నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి అనౌన్స్ చేసి సంవత్సరం అవుతున్నా ఇంకా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని తన ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా సమంత నిర్మాతగా మొదటి సినిమా ప్రారంభమయ్యింది. అంతా అప్‌కమింగ్ నటీనటులతో ఒక కామెడీ చిత్రంతో నిర్మాతగా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యింది సామ్. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇంట్రెస్టింగ్ పోస్టర్

‘ఎంతో ఎగ్జైట్మెంట్‌తో త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నుండి మొదటి థియేట్రికల్ ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేస్తున్నాను.. అదే శుభం. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి’ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది సమంత. ఇక ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పాతకాలం టీవీలో వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో నటీనటులు కనిపిస్తారు. దీంతో ఇది ఒక పీరియాడికల్ కామెడీ అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. సమంత నిర్మాతగా కొత్త బాధ్యతలు తీసుకుంటుడడంతో తను సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్ అంతా తనకు విషెస్ చెప్తున్నారు.

Also Read: రష్మికకు ప్రొటెక్షన్ అవసరం.. కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్

అప్‌కమింగ్ నటీనటులతో

‘శుభం’ (Subham) సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్ పేరి హీరోలుగా నటిస్తుండగా.. శ్రియా కొంతం, షాలిని హీరోయిన్లుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోయిన్‌గా ఎంతో సక్సెస్ సాధించిన సమంత.. ఇప్పుడు నిర్మాతగా ఎంతవరకు సక్సెస్‌ను అందుకోగలదో చూడాలి అని ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. సమంత వెండితెరపై యాక్టివ్‌గా ఉండి చాలాకాలమే అయ్యింది. తను చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తన ఫోకస్ అంతా పూర్తిగా వెబ్ సిరీస్‌లపైనే పెట్టింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో హిందీ యాక్షన్ వెబ్ సిరీస్‌లో బిజీగా ఉన్న సామ్.. దాంతో పాటు నిర్మాతగా కూడా బిజీ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×