BigTV English

Vijayasai meets Amitshah: జగన్ స్కెచ్ మామూలుగా లేదుగా, వారంలో రెండోసారి..అమిత్ షాతో సాయిరెడ్డి భేటీ

Vijayasai meets Amitshah: జగన్ స్కెచ్ మామూలుగా లేదుగా, వారంలో రెండోసారి..అమిత్ షాతో సాయిరెడ్డి భేటీ

Vijayasai reddy meets Amit shah(AP political news): వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు అంతుబట్టవు. అధికారంలో ఉన్నా లేకు న్నా.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఏపీలో చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ దుమ్మెత్తి పోస్తుండగా, మరోవైపు ఢిల్లీలో సైలెంట్‌గా పావులు కదుపుతోంది ఆ పార్టీ. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వారంలో రెండుసార్లు కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? అన్న చర్చ ఏపీలో మొదలైంది.


నిప్పులేనిదే పొగ రాదు.. ఈ సామెత అచ్చం వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. వైసీపీలో నెంబర్ టూగా చలామణి అవుతున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ వారంలో రెండుసార్లు కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. హోంమంత్రితో ఆయన ఎందుకు భేటీ అయ్యారన్నది బయటకు తెలీదు. కానీ.. కొన్ని వార్తలు మాత్రం సర్కులేట్ అవుతున్నాయి. ఈ భేటీ వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్నది రాజకీయ నేతల మాట.

ఎన్డీయే సర్కార్‌లో చంద్రబాబు పాత్ర చాలా కీలకం. మోదీ సర్కార్ ఐదేళ్లు నడవాలంటే కచ్చితంగా టీడీపీ మద్దతు ఉండాల్సిందే.. లేకుంటే కష్టాలు తప్పవు. ఈ విషయం తెలిసి కూడా బీజేపీతో వైసీపీ తెరవెనుక మంతనాలు జరుపుతోంది. తమపై ఎలాంటి కేసులు పెట్టవద్దని, తమకు కేంద్రం అండ వుందని చెప్ప డానికే జగన్ ఈ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సందేశం చంద్రబాబు సర్కార్‌కు పంపిస్తున్నారా అన్న డౌట్ మొదలైపోయింది.


ALSO READ: వేడెక్కిన విశాఖ తీరం..ఎమ్మెల్సీ ఎన్నికల సమరం

ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ లోకి పంపాలన్నది జగన్ ప్లాన్. ఈ విషయమై అమిత్ షాతో విజయసాయిరెడ్డి మాట్లారన్నది దాని వెనుక సారాంశం. సాయిరెడ్డి చెప్పిందని షా విన్నారని అంటున్నారు. అలాకాకుండా పార్టీని బీజేపీలో కలిపేస్తామ నే సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. చెప్పిందంతా విని అమిత్ షా సైలెంట్ అయ్యారని అంటున్నారు.

ఇప్పుడు కాకపోతే రేపటిరోజైనా సాయిరెడ్డి దౌత్యం ఫలించి మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ ఆలోచన మామూలుగా లేదని అంటున్నారు. అయితే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కూటమిని వదిలి బయటకురావడం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×