BigTV English

CM Revanth Reddy visit in US: అమెరికాకు సీఎం రేవంత్ టీమ్.. పెట్టుబడులపై ఫోకస్.. ఆ తర్వాత ?

CM Revanth Reddy visit in US: అమెరికాకు సీఎం రేవంత్ టీమ్.. పెట్టుబడులపై ఫోకస్.. ఆ తర్వాత ?

CM Revanth Reddy USA tour updates(Telangana congress news): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం తెల్లవారుజామున అమెరికాకు వెళ్లారు. ఆయన వెంట ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సహా పలువురు అధికారులు ఉన్నారు. పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరంతా పర్యటించనున్నారు.


తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ అమెరికాకు వెళ్లింది. దాదాపు 10 రోజులపాటు అక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మళ్లీ ఈనెల 14న తెలంగాణకు రానున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతోంది. తొలుత హైదరాబాద్ నుంచి నేరుగా న్యూయార్క్ చేరుకుంటున్నారు. అక్కడి నుంచి న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు.

పదిరోజుల టూర్‌లో భాగంగా దాదాపు 50కి పైగా వ్యాపారవేత్తలతో సమావేశాలు జరగనున్నాయి. ఇందులో అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ఉన్నారు. అమెజాన్, కాగ్నిజెంట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, పెప్సీకో, అమెరికన్ ఎయిర్‌లైన్స్ సీఈఓలతోపాటు ఐటీ, ఫార్మా ఇతర పరిశ్రమలకు చెందినవారితో పెట్టుబడులపై మంతనాలు జరపనున్నారు.


ALSO READ: సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్ర భేటీ.. పెట్టుబడులు, స్కిల్ యూనివర్సిటీపై చర్చ

ఈనెల ఆరున ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ టీమ్. ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచబ్యాంకును భాగస్వామ్యం చేయాలన్నది అసలు ఆలోచన. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి టీమ్ సందర్శించనుంది. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడి డీన్‌తో మాట్లాడనుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×