BigTV English

Vizag YSR View Point name changed: ఏపీలో మార్పులు మొదలయ్యాయా? మారిన వైఎస్సార్ వ్యూ పాయింట్

Vizag YSR View Point name changed: ఏపీలో మార్పులు మొదలయ్యాయా? మారిన వైఎస్సార్ వ్యూ పాయింట్

Vizag YSR View Point name changed(AP latest news): ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. నాలుగైదు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముందుగానే మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. విశాఖ‌లో ఒకప్పుడు వివాదానికి కేంద్రంగా మారిన వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌ పేరు అర్థరాత్రి మార్చేశారు.


మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ పేరుపై అబ్దుల్ కలాం పేరిట స్టిక్కర్లు అంటించారు. దీంతో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం తెలియ గానే వైసీపీ అభిమానులు ఉదయం విశాఖ బీచ్‌కు వచ్చారు. దీనిపై పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు.

విశాఖ బీచ్‌కు సమీపంలో సీతకొండ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వ్యూ పాయింట్‌ను అధికారులు అభివృద్ధి చేశారు. అధికారుల పర్మిషన్‌తో దాన్ని వైఎస్సార్ వ్యూపాయింట్‌గా మార్చారు. ఆ సమయంలో అధికార వైసీపీ-టీడీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు తారాస్థాయికి చేరాయి.


ALSO READ: నేడు చంద్రబాబు ఢిల్లీ పయనం.. NDA కీలక భేటీ

తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే వైఎస్సార్ వ్యూపాయింట్‌ పేరు అబ్దుల్ కలాం వ్యూపాయింట్‌గా మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వ్యతిరేకించిన కూటమి అభిమానులు తిరిగి అబ్దుల్ కలాం పేరు కనిపించేలా వ్యూ పాయింట్ వద్ద స్టిక్కర్లు అతికించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇరుపార్టీల నేతలు దీనిపై సైలెంట్‌గా వున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×