SIM Deactivation : సిమ్ కార్డుకు రీఛార్జ్ చేయకపోతే కొన్ని రోజులకు డీ యాక్టివేట్ అవుతందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రీఛార్జ్ చేయడం ఆపేసిన ఎన్ని రోజులు తర్వాత ఆగిపోతుందనే విషయంపై చాలా మందికి క్లారిటీ లేదు. అయితే సిమ్ ఆగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే… ప్రముఖ టెలికాం సంస్థలు పాటించే కొన్ని నిబంధనలను తెలుసుకోవాలి. ఆ నిబంధనల ప్రకారమే సిమ్ కు రీఛార్జ్ ఆపేసిన తర్వాత డీ యాక్టివేట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
సాధారణంగా ఈ రోజుల్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నీ డ్యూయల్ సిమ్ సెటప్ తోనే వస్తున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరి ఫోన్లో రెండు సిమ్స్ ఉంటున్నాయి. యూజర్స్ దీంట్లో అవసరమైన నెట్వర్క్ కు రీఛార్జ్ చేసి వేరే సిమ్ ను అలాగే వదిలేస్తున్నారు. అయితే సిమ్ కు రీఛార్జ్ చేయటం మానేసిన కొన్ని రోజులు ఇన్కమింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అవి కూడా ఆగిపోతాయి. అయితే రీఛార్జ్ ఆపేసిన తర్వాత ఎలాంటి టెలికాం సంస్థలైనా కొన్ని రోజులు మాత్రమే సర్వీసెస్ ఇవ్వగలుగుతాయి.
నిజానికి సిమ్ కార్డుకు బేసిక్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ అవసరం అవుతుంది. ఆ తర్వాత SMS, అవుట్ గోయింగ్ కాల్స్ ఆగిపోతాయి. డేటా సేవలు సైతం నిలిచిపోతాయి. ఇన్కమింగ్ కాల్స్ కొన్ని రోజులు వస్తాయి. ఇక సాధారణంగా ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్.. ఈ నిబంధనలు పాటిస్తూ ఉంటాయి. వాటి రూల్స్ ప్రకారం సిమ్ కు 90 రోజుల పాటూ రీఛార్జ్ చేయకపోతే పూర్తిగా డీ యాక్టివేట్ అవుతుంది.
ఇలా డీ యాక్టివేట్ అయిన సిమ్ ను వేరొకరికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ కారణాలతోనైనా ఒక్కసారి డీ యాక్టివేట్ అయిన సిమ్ మళ్లీ ఆరు నుంచి తొమ్మిది నెలల వరకూ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండదు. ఇక వేరొకరికి ఇవ్వకముందే సిమ్ ను మళ్లీ కావాలనుకుంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే.
డీ యాక్టివేట్ అయిన సిమ్ కార్డ్ మళ్ళీ యాక్టివేట్ చేయడానికి నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. నెట్‌వర్క్ సంస్థకు వెళ్లి కొత్త KYC డాక్యుమెంట్స్ తో వేరిఫికేషన్ చేయించాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సిమ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఒక ఏడాది పడుతుంది.
అందుకే ఈ సమస్యలేవి లేకుండా ఉండాలంటే సిమ్ ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయాలి. చాలా కాలం పాటు అలా వదిలేయడం వల్ల డీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అవసరం లేని సిమ్ కార్డ్స్ రీఛార్జ్ చేయకపోయినా సమస్య ఉండదు కానీ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కేవైసీ, స్టడీ రిలేటెడ్ వెబ్ సైట్స్ కు లింక్ చేసి ఉన్న సిమ్స్ కు మాత్రం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను తేలిక తప్పించుకోవచ్చు. ఇక ఇంకెందుకు ఆలస్యం.. మీరూ అవసరమైన సిమ్ కు రీఛార్జ్ చేయకుండా వదిలేస్తే వెంటనే మేల్కొండి.
ALSO READ : 2025లో రాబోతున్న టాప్ మెుబైల్ ఇవే.. ఐఫోన్ 17, సామ్ సాంగ్ S25తో పాటు ఇంకా ఎన్నో!