BigTV English
Advertisement

War 2 : టీజర్ తేడా కొట్టింది, సినిమా టీం పోస్ట్ పోన్ ప్లాన్ చేస్తుంది 

War 2 : టీజర్ తేడా కొట్టింది, సినిమా టీం పోస్ట్ పోన్ ప్లాన్ చేస్తుంది 

War 2 : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తుంది. ఫ్లాప్ డైరెక్టర్ తో జతకట్టిన కూడా హిట్ సినిమా చేయటం ఆనవాయితీగా మారిపోయింది. ఇదివరకే కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో పనిచేసే మంచి సక్సెస్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అంటే ముందు వారిద్దరూ కూడా తీవ్రమైన డిజాస్టర్లు చవి చూశారు. ఎన్టీఆర్ మాత్రం పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకుంటూ కెరియర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించక పోయినా కూడా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పడంతో ఆల్మోస్ట్ ఇదే టైటిల్ కన్ఫామ్ అయిపోయింది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.


వార్ 2 సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ 

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా వార్ 2. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ లాంటి హీరో సినిమా చూడటం అదృష్టం అనుకుంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరో కూడా ఉండటం బోనస్ అని చెప్పాలి. వీరిద్దరిని స్క్రీన్ మీద చూడడానికి ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొన్ని ఫంక్షన్స్ కు హాజరైన తరుణంలో వార్ 2 సినిమా గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ వచ్చాడు. ఈ సినిమాను ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది.


టీజర్ వలనే పోస్ట్ పోన్ 

కొంతమంది యాక్షన్ లవర్స్ కు ఈ టీజర్ విపరీతంగా నచ్చింది. ఇంకొంతమంది మాత్రం ఈ టీజర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ టీజర్ లో సి జి షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ను కనీసం అందుకోలేకపోయింది అనే కంప్లైంట్ కూడా ఉంది. ఈ తరుణంలో సినిమా మీద మరింత కేర్ తీసుకుని పగడ్బందీగా ప్లాన్ చేయడానికి ఈ సినిమా పోస్ట్ పోన్ చేయనున్నట్లు విశ్వసినీయవర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. కానీ దీని గురించి ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. అందుకే ఈ సినిమాపై కూడా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది.

Also Read : Atlee – Allu Arjun : టెక్నీషియన్స్ ను ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదా.? వేరే ప్రాజెక్టు మానేస్తే పెట్టుకుంటున్నారు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×