E-Paper
Advertisement

Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం

Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం
Advertisement

Viveka murder case: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎటువంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను అతి త్వరలో బయటపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

ఇక ఈ కేసులో దర్యాప్తు కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారిని మార్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై మార్చి 20న న్యాయస్థానం విచారణ జరిపింది. తిరిగి సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

Advertisement

సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్టులో రాజకీయ వైరం కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు తప్పితే.. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర గురించిన సమాచారం ఏదీ వెల్లడించలేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, ఇలా ఇంకెంత కాలం కొనసాగిస్తారని అసహనం వ్యక్తం చేసింది.

Related News

చీరాలలో కాంగ్రెస్ సంచలనం.. కూటమికి వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

కౌంటింగ్ ముంగిట విషాదం.. జనసేన MPTC అభ్యర్థి మృతి!

పొమ్మనకుండా పొగబెట్టారు.. ఆత్మగౌరవం చంపుకోలేకే బయటకొచ్చా: విజయసాయిరెడ్డి

చెన్నైలో వైఎస్ ఫ్యామిలీ వివాహ వేడుక.. వేదికపై సీఎం విజయ్, జగన్, అదానీ.. ఇంతకీ కొత్త స్కెచ్ ఏంటి?

కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక రద్దు.. మళ్లీ రీపోలింగ్?

మున్సిపల్ చైర్‌పర్సన్ సీటు కోసం లవర్‌ని పెళ్లిచేసుకున్న టీడీపీ నేత.. కానీ చివరికి..?

లక్షల రూపాయల ప్రజాధనం వృదా అయినట్టేనా.. పరకాల మార్కెట్ యార్డ్‌లో దారున సమస్య!

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నేపాల్ ఏజెంట్ దారుణం.. ఏం చేసాడంటే..?

Big Stories

Advertisement
×