BigTV English

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Corona: కరోనా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకుంటున్నారా..? లేదు కరోనా ఇంకా పోలేదు. మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. ఓ వైపు ఫ్లూ పంజా విసురుతుంటే.. మరోవైపు కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో 1805 కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో కరోనా తీవ్రత ఎంతలా ఉందో. థర్డ్ వేవ్ ముప్పు తొలగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన ఏడు రోజుల్లో కేసుల సంఖ్య 78 శాతం పెరిగింది. కొత్తగా ఈ మహమ్మారి బారిన పడి 29మంది ప్రాణాలు కోల్పోయారు.


మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ గత ఏడు రోజుల్లో 1956 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1579 కేసులు వెలుగు చూశాయి. కేరళ, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తోంది. దేశంలో మార్చి 19 నుంచి 25 మధ్య కొత్తగా 8,781 కేసులు నమోదయ్యాయి. గత ఆరు వారాల నుంచి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 5 వందలకు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి.

రోజురోజుకు కరోనా కేసులు డబుల్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాగా ఏదైన ప్రమాదం ముంచుకొస్తుందా అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మ్యుటేషన్ల వల్లే కేసులు పెరుగుతున్నాయని.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పని సరి అని సూచిస్తున్నారు.


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×