BigTV English

Vizag Fire Accident: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన రోగులు!

Vizag Fire Accident: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన రోగులు!

Vizag Fire Accident in Hospital: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఉన్న సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భయభ్రాంతులతో వైద్యులు, పేషెంట్స్, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ మంటలు అడ్మిన్ బ్లాకులో చెలరేగినట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 30 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతకుముందు మంటలు చెలరేగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పేషంట్లతోపాటు ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలోని ఇతర బ్లాక్‌లలోకి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పేషంట్స్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Also read: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్

ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పట్టణంలో జరిగిన ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో ఘటన జరగడంతో ఆస్పత్రికి వచ్చేందుకు రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×