BigTV English

Vizag Fishing Harbor : ఫిషింగ్ హార్బర్ ఘటనలో వీడిన మిస్టరీ.. బోట్లను తగలబెట్టిన సిగరెట్

Vizag Fishing Harbor : ఫిషింగ్ హార్బర్ ఘటనలో వీడిన మిస్టరీ.. బోట్లను తగలబెట్టిన సిగరెట్
Vizag Fishing Harbor news

Vizag Fishing Harbor news(Breaking news in Andhra Pradesh) :

సంచలనంగా మారిన విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన అనేక మలుపులు తీసుకుంది. చివరికి పోలీసులు ఈకేసులో ఓ కంక్లూజన్‌కి వచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని.. ఇందులో కుట్రకోణం ఏమీ లేదని పోలీసులు తేల్చారు. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. బోట్ నెంబర్ 887లో ఇద్దరూ మద్యం తాగి, ఫిష్ ఫ్రై చేసుకుని పార్టీ చేసుకున్నారని చెప్పారు. మద్యం మత్తులో పక్కన ఉన్న 815 నంబర్ బోటుపై సిగరెట్ పీలిక పడేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పెద్దగా గాలి రావడంతో.. ఆ సిగరెట్ పీలిక చేపల వలకు అంటుకుంది. ఆ తర్వాత మంటలు బోటు ఇంజన్ కు విస్తరించాయన్నారు. అలా మిగిలిన బోట్లకు మంటలు వ్యాపించి కాలిపోయాయని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన తర్వాత అక్కడి నుంచి నిందితులిద్దరూ మెల్లగా జారుకున్నారని విశాఖ సీపీ చెప్పారు.

ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం ముగ్గురు నానిలను విచారించినట్టు సీపీ తెలిపారు. ఇందులో భాగంగా యూట్యూబర్ నానిని కూడా ప్రశ్నించామని అన్నారు. కానీ.. ఇంతలోనే యూట్యూబర్ నాని ఫ్యామిలీ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయిందని చెప్పారు. చాలా సున్నితమైన, ప్రమాదకరమైన ఈ కేసులో నిందితులెవరో తేలిందని.. కొంతమేర ఇబ్బంది పడినా.. దర్యాప్తును చివరి దశకు తీసుకొచ్చామని చెప్పారు. 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించి ఇన్ని రోజులు ఆధారాలు సేకరించామని అన్నారు. మొత్తానికి నిందితుల్ని అరెస్ట్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది.


Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×