BigTV English

Q-Star project : ఏమిటీ ‘క్యూ-స్టార్’ ప్రాజెక్టు?

Q-Star project : ఏమిటీ ‘క్యూ-స్టార్’ ప్రాజెక్టు?
Q-Star project

Q-Star project : స్టార్టప్ ఓపెన్ ఏఐలో ఐదు రోజుల వివాదం సద్దమణిగింది. ఆ సంస్థ పగ్గాలను ఏఐ సూపర్ స్టార్ శామ్ ఆల్ట్‌మన్ తిరిగి చేజిక్కించుకున్నారు. ఈ రచ్చకు కారణం Q* (క్యూ-స్టార్) ప్రాజెక్టేనంటూ ప్రచారం కూడా జరిగింది. ఇంతకీ ఏమిటీ ప్రాజెక్టు?


ఓపెన్ ఏఐ కొత్తగా డెవలప్ చేస్తున్న ఏఐ మోడల్ ఇది. కృత్రిమ మేధ(AI)లో ఇదో విప్లవాత్మక మలుపు కాగలదని ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ మోడల్ ద్వారా ఏఐ రీజనింగ్ మరింత మెరుగుపడుతుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI)లో ఓపెన్ ఏఐ సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనంగా Q* ప్రాజెక్టును అభివర్ణిస్తున్నారు.

ఏఐ అంటే ఒక టాస్క్‌కే పరిమితమవుతుంది. అంటే ఏదైనా ఒక సమస్యకు సంబంధించి మానవుల కన్నా మెరుగ్గా పరిష్కరించగల సత్తా ఏఐ‌కు ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల క్రితమే చెస్ ఆటలో మానవులను ఏఐ అధిగమించగలిగింది. కానీ ఆ నిర్దిష్ట ఏఐ రీడింగ్, ప్లానింగ్ వంటి ఇతర పనులేవీ చేయలేదు. బ్యాంక్ రుణాల మదింపు, వ్యాధుల నిర్థారణ, ప్రకృతి విపత్తుల ముందస్తు అంచనా వంటి పనుల కోసం వేర్వేరుగా ఏఐ టూల్స్‌‌ అందుబాటులో ఉన్నాయి. వీటికి భిన్నంగా ఏజీఐ మోడల్ ఈ పనులన్నింటినీ చక్కపెట్టేయగలదు.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న జనరేటివ్ ఏఐ మోడల్స్.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని పనిచేస్తాయి. ఏజీఐ అనేది అటానమస్ సిస్టమ్. నిర్ణయాలకు తర్కాన్ని(రీజనింగ్) జోడించగల సామర్థ్యం ఏజీఐ మోడళ్ల సొంతం. అంటే దాదాపు మానవులకు సరిసమానస్థాయిలో సమస్యలను పరిష్కరించగలవన్నమాట.

నిరంతర సాధన, అభ్యాసం ద్వారా మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. ఏజీఐ కూడా అంతే. మనకు ఉన్న క్యుములేటివ్ లెర్నింగ్ లక్షణం ఈ సాంకేతికతలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిరంతర అభ్యాసం ద్వారా ఏజీఐ మోడళ్లు కూడా తమను తాము మెరుగుపర్చుకుంటూ వెళ్లగలవు.

ఏజీఐ ప్రత్యేకతల వల్ల మేథమెటికల్ ప్రోబ్లమ్స్‌ను సైతం Q* లాంటి మోడళ్లు పరిష్కరించగలవని నిపుణులు చెబుతున్నారు. వాటికి ఉన్న కంప్యూటింగ్ పవర్ కారణంగా ఇది సాధ్యపడుతోందని అంటున్నారు. గ్రేడ్-స్కూల్ విద్యార్థులకన్నా మిన్నగా Q* ప్రాజెక్టు పనిచేస్తుందని భావిస్తున్నారు. అయితే ఏజీఐ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఏజీఐ టెక్నాలజీ‌కి ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉంటే.. మరో నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయం.

ఏజీఐ టెక్నాలజీతో ఆవిష్కరణలు మరింత ముందుకు వెళ్లగలవని శామ్ ఆల్ట్‌మన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు రిసెర్చర్లలో ఈ సాంకేతికతపై భయాందోళనలు ఉన్నాయి. Q* తరహా ప్రాజెక్టుల వల్ల మానవాళికి కలిగే మేలు కన్నా కీడే ఎక్కువని సంశయిస్తున్నారు. Q* కు ఉన్న శక్తిమంతమైన అల్గారిథమ్ వల్ల.. మానవ మేధస్సుకే అది సవాల్ విసరగలదనే ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు రిసెర్చర్లు ఓపెన్ ఏఐ బోర్డు డైరెక్టర్లకు లేఖ రాశారు. ఏఐ ఎథిక్స్‌కు సంబంధించి ఆ లేఖలో వివరాలేవీ వెల్లడి కాకున్నా.. శామ్‌పై వేటుకు డైరెక్టర్లను పురిగొల్పింది మాత్రం అదేనన్న ప్రచారం జరిగింది.

Related News

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

Big Stories

×