Vizag News: విశాఖలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడలోని ఇండనీరింగ్ కాలేజీలో ర్యాగింగ భూతం పడగ విప్పింది. సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ పంచాయితీ పోలీస్టేషన్ వరకు చేరింది. పోలీసులు పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు మధ్య గొడవ జరిగింది. కాలేజీలో ఏటా జరిగే యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. అయితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు.. EEE థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి తగిలింది. దీంతో గొడవ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలు తగిలించిన విద్యార్థి క్షమాపణలు చెప్పిన సీనియర్ వినలేదు. తన స్నేహితులతో కలిసి సెకండ్ ఇయర్ విద్యార్ధిని సీనియర్లు చితకొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కు
స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టారు. బాధితుడు ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎన్నిసార్లు జరిగిన విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రుల వాదన.. విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం తరుచు ఘర్షణలు జరుతున్నాయి.
Also Read: తునిలో రణరంగం.. టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ, వైస్ ఛైర్మన్ ఎవరు?
ఇదిలా ఉంటే.. ఆల్లూరి జిల్లా పాడేరులో దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి విద్యార్థినిపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థినిలు సిగరెట్ త్రాగుతున్నారని.. ప్రిన్సిపాల్ కు చెప్తానడంతో 7వ తరగతి విద్యార్థిని బంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఘటనపై డీఈఓ విచారణకు ఆదేశించారు. ఏడో తరగతి విద్యార్థినికి ఎలాంటి హానీ జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.