BigTV English

RGV : ఐ హేట్ శారీ… అమ్మాయిల చేతిలో చచ్చినా సరే… ఆర్జీవీ షాకింగ్ స్టేట్మెంట్

RGV : ఐ హేట్ శారీ… అమ్మాయిల చేతిలో చచ్చినా సరే… ఆర్జీవీ షాకింగ్ స్టేట్మెంట్

RGV : టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తీస్తున్న సరికొత్త మూవీ ‘శారీ’ (Saree). గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆర్జీవి ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్యా యాదవ్, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.


ఇందులో భాగంగా ఇప్పటికే ‘శారీ’ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే మూవీ ప్రమోషన్ల విషయంలో ఆర్జీవి సరికొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతాడు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన రూటు మార్చి ఏకంగా 5 మంది స్టార్ యాంకర్లతో ఓ వీడియోలో రాఖీ కట్టించుకోవడం అనే విషయంతో పాటు, శారీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చర్చించారు.

ఆర్జీవీ దగ్గర రాఖీ ప్రస్తావన


రామ్ గోపాల్ వర్మ తీరే సపరేటు అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ గోపాల్ వర్మ ఒకేసారి 5 మంది సీనియర్ యాంకర్లతో ‘శారీ’ మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టారు. పైగా ఇంటర్వ్యూలో ఆయన బుద్ధిగా సమాధానాలు ఇస్తూ కనిపించారు.

అందులో ఓ యాంకర్ ఆర్జివీనీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. “మీరు ఎప్పుడైనా మీ సొంత అక్కా చెల్లెళ్లతో కాకుండా వేరే అమ్మాయిలతో రాఖీ కట్టించుకున్నారా?” అని ప్రశ్నించారు. దానికి ఆర్జీవి “లేదు” అని సింపుల్ గా సమాధానం చెప్పారు.

“ఒకవేళ రక్షా బంధన్ రోజు అందరూ మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు?” అని అడగ్గా… ఆర్జీవి “నేను గోడ దూకి పారిపోతాను” అని సమాధానం చెప్పాడు. “అమృత, ప్రణయ్ వంటి కేసుల్లో కులోన్మాదం అన్నారు. మీ సినిమాలోనూ అమ్మాయే విక్టిమ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇటీవల కాలంలో ఉమెన్స్ కమిషన్ ఉన్నట్టుగానే, మెన్స్ కమిషన్ కూడా ఉండాలి అని ప్రత్యేక హక్కుల కోసం అబ్బాయిలు పోరాడాలని అంటున్నారు. ఇలా కాకుండా అబ్బాయిల మీద కూడా ఎప్పుడు ఫోకస్ చేస్తారు?” అనే ప్రశ్నకు… “అమ్మాయిలు వీక్ అని కన్సిడర్ చేస్తారు. నిజానికి అబ్బాయిలు కొంతమంది మాత్రమే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే లా అనేది వీక్ గా ఉండే మహిళలకు సపోర్టుగా ఉంటుంది” అని ఆర్జీవి చెప్పుకొచ్చారు.

ఐ హేట్ శారీ 

ఆర్జీవి ఇంకా మాట్లాడుతూ “అబ్బాయిలను ఇబ్బందులకు గురి చేసే అమ్మాయిల విషయంలో ఎలాంటి ఐడియల్ సొల్యూషన్ ఉండదు. నేను పర్సనల్ గా అమ్మాయిలను ఇష్టపడతాను. కాబట్టి… అమ్మాయిలు చంపేసినా నేనేమీ అనుకోను. పైగా వాళ్లకి నేను ఎలాంటి హాని చెయ్యను. తప్పు ఎవరిదైనా సరే, అమ్మాయిలు చంపడం అనేది నేను పట్టించుకోను” అంటూ ఆర్జీవీ తప్ప ఇంకెవ్వరూ ఇలా సమాధానం ఇవ్వలేరు అన్పించేలా చేశారు. అలాగే తనకు శారీ అంటే నచ్చదని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×