Visakhapatnam: విశాఖ జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి అడ్డంగా బుక్కయ్యారు. ఆమెపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలో ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టారు అనంత లక్ష్మి. అంతేకాదు సీఐపై కూడా రుసరుసలాడారు. ఈ వ్యవహారంపై ఆమెపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
విశాఖపట్నం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వ సిద్ది అనంతలక్ష్మికి చిక్కులు మొదలయ్యాయి. ఆమెపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన కొత్తూరు నరేంద్ర వృత్తి రీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరువురు మధ్య ఏం జరిగిందో తెలీదు.
నరేంద్ర తమ దగ్గర రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ అనంత లక్ష్మి మార్చి రెండున గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నరేంద్రను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పట్టరాని కోపంతో నరేంద్రను చెప్పుతో కొట్టారు. చివరకు నరేంద్రను అరెస్టు చేశారు పోలీసులు, ఆపై బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇదంతా గతం. ప్రస్తుతానికి వచ్చేద్దాం.
సీసీటీవీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేత
అనంతలక్ష్మి తనను చెవిలో రక్తం కారేలా కొట్టారని నరేంద్ర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు, నరేంద్రను కొట్టిన విషయం నిజమేనని తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు.
ALSO READ: హైకోర్టు అలా.. సుప్రీంకోర్టు ఇలా మిథున్ రెడ్డికి ఊరట
మరోవైపు ఈ కేసు సమయంలో టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి పోలీసులను బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు. నరేంద్ర విషయంలోనే కాసింత ఆవేశంగా మాట్లాడారు. తన సంగతి మీకు తెలియదని, ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ సీఐని బెదిరించారనే విమర్శలు లేకపోలేదు.
అనంతలక్ష్మి తనను హెచ్చరించిన విషయం వాస్తవమేనని అన్నారు సీఐ. దాడి చేసి కొట్టినందున ఆమెపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అధికార పార్టీ నేతపై కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మిపై కేసు నమోదు
గాజువాక పోలీస్ స్టేషన్ లో ఎస్సై సమక్షంలోనే కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టిన అనంత లక్ష్మి
సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని బెదిరింపులు
అనంత లక్ష్మిపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/G9NyYCwTNc
— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2025