BigTV English

Mithun Reddy: హైకోర్టు అలా.. సుప్రీం ఇలా.. మిథున్ రెడ్డికి ఊరట

Mithun Reddy: హైకోర్టు అలా.. సుప్రీం ఇలా.. మిథున్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అనుకుంటున్న టైమ్ లో ఆయనకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఏపీ మద్యం కేసులో మిథున్ రెడ్డిని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు ఏపీ పోలీసులకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు ాయన్ను అరెస్ట్ చేయవద్దని చెప్పింది. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ఏపీ సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంలో కాస్త ఊరట లభించినా, మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం ఖాయమనే అంటున్నారు.


హైకోర్టులో చుక్కెదురు..
వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ విచారణ మొదలు పెట్టింది. పార్టీ నేతల పేర్లతో కొత్త కంపెనీలు సృష్టించి తక్కువ క్వాలిటీ మద్యాన్ని అమ్మారనే ఆరోపణల మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డికి ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు నోటీసులిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన మిథున్ రెడ్డి ముందుగా హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరారు. ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఇంకా మిథున్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొనలేదని ఏపీ సీఐడీ కోర్టుకి తెలిపింది. దీంతో కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది.

సుప్రీంకోర్టులో ఊరట..
హైకోర్టు తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆయనకు అక్కడ ఊరట లభించింది. విచారణ పేరుతో పిలిచి ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఏపీ సీఐడీ పోలీసులకు ఆదేశాలిచ్చింది.


మధ్యలో హైడ్రామా..
మిథున్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదన్న ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన మరుసటి రోజే ఆయన కోసం ఢిల్లీ చేరుకున్నారు. దీంతో మిథున్ రెడ్డి షాకయ్యారు. ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసే అవకాశముందని అనుమానించారు. అందుకే ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఎట్టకేలకు బెయిల్ రావడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు మిథున్ రెడ్డి.

వదిలేస్తారా..?
ఏపీలో వైసీపీ హయాంలో మద్యం విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. మద్య నిషేధం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మిందని అంటున్నారు. సొంత బ్రాండ్లతో వైసీపీ నేతలే మద్యం తయారు చేసి, వాటిని అధిక ధరకు విక్రయించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో చాలామంది బడా నేతల పేర్లు వినపడుతున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈ అవినీతిలో భాగముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఏపీ సీఐడీ.. పలువురిని ప్రశ్నించింది. మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్న క్రమంలో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. అయితే సీఐడీ మాత్రం మిథున్ రెడ్డి విషయంలో పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×