Ram Charan Peddi..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) .. దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో గ్లోబల్ స్టార్ అయిపోయిన రామ్ చరణ్ కు అరుదైన గౌరవాలు కూడా లభించాయి. ఇకపోతే ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో మెగా అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ తో బోల్తాపడ్డ పెద్ది టీమ్..
ఇప్పుడు ఎలాగైనా సరే ఒక సక్సెస్ అందుకోవాలని రామ్ చరణ్ తెగ తాపత్రయ పడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘ఉప్పెన’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar ) శిష్యుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసిన టీమ్.. సినిమా నుండి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. కానీ ఈ పోస్టర్ విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్పరాజ్ ల పెద్ది పాత్ర ఉందని , చాలామంది నెగటివ్ కామెంట్లు, రివ్యూలు ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ బుచ్చి బాబు పై సీరియస్ అయ్యారట. ఇకనుండి ఈ సినిమా నుంచి విడుదల చేసే ఏ చిన్న అప్డేట్ అయినా సరే తన పర్యవేక్షణలోనే విడుదల చేయాలని సూచించారట.
ఫస్ట్ షాట్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పెద్ది..
ఇక రామ్ చరణ్ చెప్పినట్టుగానే నిన్న ఈ సినిమా నుండి ఫస్ట్ షాట్ విడుదల చేయగా.. ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లోనే 30M+ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇకపోతే ఇప్పటివరకూ ఎన్టీఆర్ (NTR ) దేవర (Devara) సినిమాకు 28.17M వ్యూస్ రాబట్టి అత్యధిక న్యూస్ సాధించిన ఫస్ట్ షాట్ గా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది పెద్ది. ముఖ్యంగా 18 గంటల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసింది.అయితే దేవరాకు ఏడు లక్షలకు పైగా లైక్స్ రాగా.. పెద్దికి కేవలం నాలుగు లక్షలకు పైగా మాత్రమే వ్యూస్ వచ్చాయి. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. మరి ఫస్ట్ షాట్తోనే గ్లోబల్ స్టార్ గాడిలో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా రిజల్ట్ తో మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుంటారో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. రంగస్థలం మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నట్లు సమాచారం.
Phenomenal – #PeddiFirstShot (Telugu) is trending on YouTube with 36.5 million real-time views in just 24 hours!#Peddi #RamCharan #PeddiFirstShot #RamCharanpeddi #Tollywood #BIGTVCinema @AlwaysRamCharan pic.twitter.com/4IhbUFhJAX
— BIG TV Cinema (@BigtvCinema) April 7, 2025