Garlic Disadvantages: వెల్లుల్లిని సహజ ఔషధంగా పిలుస్తారు. వెల్లుల్లి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో.. దీనిని అమూల్యమైన ఔషధంగా పరిగణిస్తారు. చాలా మంది దీనిని ఖాళీ కడుపుతో తినమని కూడా చెబుతుంటారు. ఎందుకంటే ఇది శరీరానికి అవసరం అయిన కొన్ని రకాల పోషకాలను కూడా అందిస్తుంది. కొంత మంది ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినమని చెబుతుంటారు. ఇలా ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.
వెల్లుల్లి తినడం వల్ల కలిగే నష్టాలు:
గుండెల్లో మంట, గ్యాస్ సమస్య:
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కడుపు పొరపై ప్రభావం పడుతుంది. దీనివల్ల చికాకు, గ్యాస్ , అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీనికి కారణం వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు. ఇవి కడుపు ఆమ్లంతో కలిపితే చికాకు కలిగిస్తాయి.
హాలిటోసిస్ సమస్య:
వెల్లుల్లికి కడుపులో, శ్వాసలో నిలిచి ఉండే ప్రత్యేక వాసనను కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఈ వాసన మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది దుర్వాసన, సామాజిక అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
అలెర్జీలు వచ్చే అవకాశం:
కొంతమందికి వెల్లుల్లి అంటే అలెర్జీ రావచ్చు, ముఖ్యంగా వేరే ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో తింటే. దురద, వాపు, తలనొప్పి మరియు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉండవచ్చు.
రక్తపోటుపై అసాధారణ ప్రభావం:
వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడినప్పటికీ.. ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తపోటు బాగా తగ్గుతుంది. ఇది ప్రమాదకరం. ముఖ్యంగా ఇప్పటికే మందులు వాడుతున్న వారికి అంత మంచిది కాదు. కొంతమందికి ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వికారం లేదా వాంతులు కూడా కలిగించవచ్చు. వెల్లుల్లి యొక్క బలమైన రుచి, తీవ్రమైన వాసన దీనికి కారణం.
గుండెల్లో మంట సమస్య:
కొంతమంది వెల్లుల్లి తిన్న తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట గురించి ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే ఆమ్లత్వ సమస్యలు ఉన్నవారికి ఇది ఆందోళన కలిగించే విషయం.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు
జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం:
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా శరీరం దానికి అలవాటుపడనప్పుడు కడుపు నొప్పి, బరువు లేదా విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.