E-Paper
Advertisement

Weather Update: వెదర్ బాంబ్.. సింగల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే 2 రోజులు చాలా జాగ్రత్త..!

Weather Update: వెదర్ బాంబ్.. సింగల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే 2 రోజులు చాలా జాగ్రత్త..!
Advertisement

Weather Update: తెలంగాణలోనూ చలి పంజా విసురుతోంది. ప్రజలు బయటికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 అయిన సరే చలి, దట్టమైన పొగమంచు తగ్గడం లేదు.. పలు గ్రామాల్లో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చాలా మంది ఉదయం పనులకు వెళ్లేవారు చలి తీవ్రతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొద్దున ఇంటి పనులు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ చలితో తీవ్రతతో వృద్ధులు, చిన్న పిల్లల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటున్నారు. అయితే ఈ చలి రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మొయినాబాద్ 6.5°C, ఇబ్రహీంపట్నం 7.5°C, శెర్లింగంపల్లి 8.1°C, మౌలాలీ 9.4, రాజేంద్రనగర్ 9.5°C, గచ్చిబౌలి 11°C, వెస్ట్ మారేడ్పల్లి 11°C, శివరాంపల్లె 11.3°C, బహదూర్‌పురా 11.4°C, గాజులరామారం 11.6°C, జీడిమెట్ల 11.9°C, అల్వాల్ 12°C, తిరుమలగిరి 12.4°C, నేరెడ్‌మెట్ 12.5°C, బేగంపేట 12.6°C, ఆసిఫ్‌నగర్ 12.6°C, గోల్కొండ 12.6°C, LB స్టేడియం 12.9°C, చార్మినార్ 12.9°C, మల్కాజిగిరి 13.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

అంతేకాకుండా తెలంగాణ మొత్తం జిల్లా్ల్లో ఎముకలు కొరికే చలి మొదలైంది. సంగారెడ్డి 6.4°C, రంగారెడ్డి 6.5°C, ఆదిలాబాద్ 7.7°C, వికారాబాద్ 8.1°C, సిద్దిపేట 8.1°C, మెదక్ 8.5°C, కామారెడ్డి 8.6°C, నిర్మల్ 8.9°C, నిజామాబాద్ 9.1°C, నాగర్ కర్నూల్ 9.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ములుగు, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ వంటి ప్రాంతాల్లో కూడా భీకరమైన చలిగాలులు వీస్తున్నాయి.

ఏపీలో కూడా చలి తీవ్ర స్థాయిలో వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అల్లూరి సీతారామ జిల్లా, అరకు, మన్యం, ముంచంగిపుట్టులో, దుబ్రిగూడలో, చింతపల్లి వంటి ప్రాంతాల్లో మంచు భీభత్సంగా కురుస్తుంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బయపడుతున్నారు.

Advertisement

Also Read: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

ఈ చలిగాలుల వల్ల ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనాదారులు ఉదయం కూడా లైట్లు వేసుకుని వెళుతున్నారు. చలి తీవ్ర ఎక్కువగా ఉన్నందున చలి మంటలతో సేద తీరుతున్నారు. అయితే మరో ఐదు రోజులు చలి ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని చెప్పారు. వేడివేడి పానియాలు, వెచ్చని దుస్తులు వంటి వాటితో చలి నుంచి ఉపశమనం పొందాలని చెబుతున్నారు.

Related News

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×