E-Paper
Advertisement

iPhone Ultra నాలుగు రంగుల్లో రానుందా? తాజా లీక్‌లో కనిపించిన కలర్స్ ఇవే!

iPhone Ultra నాలుగు రంగుల్లో రానుందా? తాజా లీక్‌లో కనిపించిన కలర్స్ ఇవే!
Advertisement

iPhone Ultra: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌గా భావిస్తున్న iPhone Ultraపై వరుసగా కొత్త లీకులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ డిజైన్, ఫీచర్లపై పలు వివరాలు చర్చకు రాగా.. ఇప్పుడు కలర్ ఆప్షన్స్‌పై కూడా ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజా లీక్ ప్రకారం.. ఈ ప్రీమియం ఫోన్ 4 విభిన్న రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిలో ఏ రంగులను యాపిల్ చివరికి అధికారికంగా ఎంపిక చేస్తుందనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.

నాలుగు కలర్ ఆప్షన్స్ ఇవే:

Xలో @ApplesClubs షేర్ చేసిన సమాచారం ప్రకారం.. iPhone Ultra నాలుగు రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. వీటిలో వైట్ లేదా సిల్వర్, బ్లాక్ లేదా డార్క్ గ్రే, డార్క్ బ్లూ, రెడ్ కలర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు ఈ వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

Also Read: గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!

వైట్, బ్లాక్ కలర్స్:

వైట్ లేదా సిల్వర్ కలర్ యాపిల్ అభిమానులకు ఎప్పటినుంచో ఇష్టమైన క్లాసిక్ ఆప్షన్. ఇక బ్లాక్ లేదా డార్క్ గ్రే వేరియంట్ ప్రీమియం, ప్రొఫెషనల్ లుక్ కోరుకునే వారికి నచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రంగులు సాధారణంగా ఎక్కువ మంది ఎంచుకునే సేఫ్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు.

డార్క్ బ్లూ, రెడ్ హైలైట్:

Advertisement

డార్క్ బ్లూ కలర్ ఈ లైనప్‌లో కొంత కొత్తగా కనిపించనుంది. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం రెడ్ వేరియంట్. ఈ రంగు నిజమైతే, iPhone 14, iPhone SE (3rd Gen) తర్వాత యాపిల్ నుంచి వచ్చే మరో రెడ్ ఐఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది.

స్పష్టతో కోసం ఎదురుచూడాలి:

రెడ్ కలర్ సాధారణ (PRODUCT) రెడ్ వేరియంట్ అవుతుందా లేదా కొత్త షేడ్‌లో వస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతానికి ఇవన్నీ లీకులే కాబట్టి.. ఖచ్చితంగా చెప్పలేం. యాపిల్ సెప్టెంబర్ నెలలో తమ ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో iPhone Ultraపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఖరీదైన పవర్ బ్యాంక్ నిజంగా బెస్టేనా? డబ్బు ఖర్చుపెట్టే ముందు ఇవి తెలుసుకోండి!

Tags

Related News

Google Pixel 10 ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో రూ.15 వేలకు పైగా ఆదా చేసే ఛాన్స్!

గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!

ఖరీదైన పవర్ బ్యాంక్ నిజంగా బెస్టేనా? డబ్బు ఖర్చుపెట్టే ముందు ఇవి తెలుసుకోండి!

అమెజాన్ ప్రైమ్ ఉచితంగా కావాలా? జియో, వీఐలో బెస్ట్ ప్లాన్లు ఇవే.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!

టీవీ రిమోట్‌లోని ఈ బటన్‌ను చాలామంది వాడరు.. కానీ దీని పని తెలిస్తే షాక్ అవుతారు!

మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కార్బన్.. ZenZ Proతో రీఎంట్రీకి రెడీ?

బడ్జెట్‌లో చూడగానే నచ్చేసే టెక్నో కొత్త ఫోన్.. 120Hz డిస్‌ప్లే, AI ఫీచర్లతో లాంచ్!

Big Stories

Advertisement
×