Vadapalli: కోనసీమకు స్వాతంత్ర్యోద్యమానికి మధ్య ఎవరికీ తెలియని కథ ఇది. లక్షలాదిమంది భారతీయులు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతా ఎదురుతిరుగుతున్న సమయంలో.. మన కోనసీమలోని ఓ ప్రాంతంలో అదే బ్రిటీష్ సైన్యాన్ని వెంటాడి వేటాడి పరుగులు పెట్టించిన ఒక సంఘటన అది. ఆ ఘటనకు జ్ఞాపకంగా ఇప్పటికీ ఓ దేవాలయానికి పంద్రాగస్టున మువ్వన్నెల జెండాలతో ఆలంకరణ చేస్తారు. దాదాపు డెబ్బయ్ ఏళ్లుగా ఈ వేడుక కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఏమిటి దీని వెనుక ఉన్న ఆ స్టోరీ.. తెలుసుకుందాం రండి..!!
తెలుగోడి సత్తా చాటేలా యావత్ సైన్యం తిరగుబాటు..
బ్రిటీష్ పోలీస్ సూపరింటెండెంట్ ఆలీ ఖాన్. అతని పేరు చెబితేనే కోనసీమ జిల్లాల ప్రజలు వణికిపోయేవారు. ఆ సమయంలో దేశం యావత్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలింది. అక్కడా ఇక్కడా అని లేదు. దేశం మొత్తం ప్రజలు బ్రిటీషర్లపై తిరగబడుతున్నారు. ఉద్యమాలు మిన్నంటాయి. సరిగ్గా అప్పుడే మన కోనసీమలోని ఓ దేవాలయంలో రథోత్సవం ఘనంగా జరుగుతోంది. అక్కడికి వచ్చిన అలీఖాన్ తూటాల వర్షం కురిపించాడు. తెలుగోడి సత్తా చాటేలా యావత్ కోనసీమ ప్రజానీకం ఖాన్ సైన్యంపై తిరగబడింది. పరుగులుపెట్టించి వెంటాడి వేటాడింది.
స్వాతంత్ర సమరయోధుల స్మారక స్తూపానికీ అంతులేని చరిత్ర..
వాడపల్లి.. ఈ పేరుతో కంటే కోనసీమ తిరుమల అంటే చాలామంది ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఇక్కడ దేవాలయానికి ఎంత చరిత్ర ఉందో అక్కడే దేవాలయం ప్రాంగణంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల స్మారక స్తూపానికీ అంతే చరిత్ర ఉంది. ఇక్కడకు వచ్చిన వాళ్లు వెంకన్న దర్శనంతో పాటు ఖచ్చితంగా స్మారక స్ధూపాన్ని దర్శించుకుంటారు . అది 1931లో స్వాతంత్రం కోసం తీవ్రమైన ఉద్యమలు జరుగుతున్న రోజులవి ప్రతి గ్రామ గ్రామాన స్వాతంత్రం కోసం నిరసనలు చేపట్టాలని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో వాడపల్లిలో చోటు చేసుకున్న ఘటన అది..
ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. జాతీయ జెండాని తీయం..
ఈ కధలో ముస్తఫా అలీ ఖాన్ అనే బ్రిటిష్ రాజమండ్రి పోలీస్ సూపర్డెంట్ గా వ్యవహరించిన వ్యక్తి చేసిన దుర్మార్గం గురించి తెలుసుకోవాలి. వాడపల్లి వెంకన్న రథోత్సవంలో బాపూజీ ఫోటోలతో జాతీయ జెండాలను రధంపై ఉంచి పురవీధుల్లో తిప్పుతున్న స్వతంత్ర ఉద్యమకారులపై ఎటాక్ చేయాలని అలీ ఖాన్ హుకుం జారీ చేశాడు..జాతీయ జెండాలను రథం పైనుంచి తీయకపోతే చావు తప్పదని బెదిరించాడు.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ జాతీయ జెండాని రథం నుంచి తీసే ప్రసక్తే లేదని ఉద్యమకారులు బ్రిటిష్ సిపాయిలకు ఎదురు నిలబడ్డారు. బ్రిటిష్ సిపాయిలు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినా కూడా అడుగు కూడా వెనక్కి వేయలేదు స్వతంత్ర ఉద్యమకారులు. దీంతో కోపంతో రగిలిపోయిన ముస్తఫా అలీ ఖాన్ స్వతంత్ర ఉద్యమకారులపై కాల్పులు జరపాలని ఆదేశించాడు. ఆ కాల్పులలో ఇద్దరు ఉద్యమకారులు అక్కడికక్కడే మరణించారు మరో ఇద్దరు కాళ్లు కోల్పోయారు. రథోత్సవంలోని ఉద్యమకారులు బ్రిటిష్ సిపాయిలపై తిరగబడి ముస్తఫా అలీ ఖాన్ తుదిమటేంచేందుకు ప్రయత్నించడంతో దాన్ని గమనించిన అలీఖాన్ ఆపారిపోయాడు.
1931 మార్చి 30న జరిగిన ఈ ఘటనపై బ్రిటిష్ పోలీసులు కేసులు నమోదు చేస్తే.. అదే ఏడాది నవంబర్ 23న అవన్నీ తప్పుడు కేసులేనని కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటనకు గుర్తుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు స్వాతంత్ర సమరయోధుల శిలాఫలకంను 1987 అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకల సందర్భంగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకట సుబ్బరాజు నిర్మించి ప్రారంభించారు. అంతటి చరిత్ర కలిగిన స్థూపం ఆలయం ముంగిటే ఉన్నా నేటి తరం కనీసం దానికి చూడకపోవడం, చాలా మంది గమనించకపోవడం కనిపిస్తుంటుంది..
Also Read: నేటి నుంచే ఫ్రీ బస్సు.. APSRTC వారికి షాకింగ్ న్యూస్.. 15 రోజుల తర్వాతే..!
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వాడపల్లికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఈ ఆలయానికి ఎదురుగా హుండీలు మధ్యన ఉండే స్థూపాన్ని అక్కడి నుంచి మార్చి అభివృద్ధి చేయడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర రావులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి ఈ స్మారక స్థూపాన్ని కొత్తగా నిర్మిస్తున్న కోనేరు వద్ద ఏర్పాటు ప్రతిపాదనకు జిల్లా కలక్టర్ నుంచి అనుమతులు లభించినట్లు తెలుస్తోంది.