BigTV English

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

Banakacherla Project:  79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక వేళ నదీ జాలలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బనకచర్లపై వెనక్కి తగ్గేది లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా-గోదావరి జలాలపై ఏ మాత్రం రాజీ పడబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ హాట్ టాపిక్‌గా మారింది.


నదీ జలాల విషయంలో మళ్లీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రధాన వేదికపై మాట్లాడారు. అదే సమయంలో నీటి వాటాల విషయంలో సీఎం చంద్రబాబు తొలుత వ్యాఖ్యానించారు. గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్ల మళ్లించాలని నిర్ణయించామన్నారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం ఉండదన్నారు. వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే.. దిగువ రాష్ట్రం ఆ నష్టాలు-కష్టాలను భరిస్తున్నామని అన్నారు. వరదను భరించాలి కానీ, ఆ నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఏ విధంగా మంచిదో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.


అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి నదీ జలాల అంశంపై నోరు విప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. గోల్కొండ వేదికగా జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: గొల్కొండలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

కృష్ణా- గోదావరి జలాల్లో నీటివాటాపై రాజీలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత నదీ జలాల అంశంపై కేంద్రం అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేసింది. నీటి వాటల గొడవను తేల్చలేదు. ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఇరురాష్ట్రాల పెద్దలను కూర్చొబెట్టి సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోంది. బీజేపీకి ఈ అంశం కాస్త ఇబ్బందిగానే మారింది.

ఆ ప్రాజెక్టు కేంద్రం మెడకు చుట్టుకునే అంశంగా కనిపిస్తోంది. ఒకవేళ బనకచర్లకు కేంద్రం అనుమతి ఇస్తే తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారంటూ రేవంత్ సర్కార్ ఎటాక్ చేసే అవకాశముంది. ఎన్డీయేలో కీలకంగా చంద్రబాబు సర్కార్‌ ఉండడంతో చేపడుతున్న పనులకు అనుమతులు ఇస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో బనకచర్ల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

 

Related News

BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక

Cm Revanth Reddy: అపోహలు నమ్మొద్దు.. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

తలకిందులుగా జాతీయ జెండా ఎగరేసిన తహసీల్దారు.. చర్యలు తప్పవా?

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

Big Stories

×