BigTV English

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని.. ఫ్యూచర్ ఏంటి ?

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని.. ఫ్యూచర్ ఏంటి ?

What is the Future of Perni Nani in Ysrcp:  మాజీ మంత్రి పేర్ని నానిఫ్యూచర్ ఏంటి ? గత ఎన్నికల్లో తాను డ్రాప్ అయ్యి – తన కుమారుడిని బరిలోకి దింపిన పేర్ని నాని.. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశముందా? తాజాగా జగన్ కు గుడ్ బై చెప్పేసి వైసీపీ నేతలంతా బయటకు వెళ్లిపోతున్నారు. అయినా పేర్ని నాని ఇంకా జగన్ భజన చేస్తున్నారు. జగన్‌ని ఎవరు ఏం చేయలేరని స్టేట్‌మెంట్లు ఇస్తూ.. వైసీపీకి రాజీనామాలు చేస్తున్నవారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పేర్ని నానీ లెక్కలేంటి?


మాజీ మంత్రి పేర్ని నాని.. వైసీపీలో తిట్ల దండకాలతో ఫోకస్ అయిన నాయకుల్లో ఒకరు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖపై ప్రెస్‌మీట్లు పెట్టారోలేదో గానీ.. ప్రత్యర్థులను తిట్టడానికైతే తరచు మైకుతో ప్రత్యక్షమయ్యేవారు. వైసీపీ ఓటమి తరువాత కూడా అడపాదడపా మైకుల ముందుకు వచ్చేసి – చంద్రబాబు , పవన్ లపై విమర్శలు చేసి పోతున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేవలం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే ఆయన మీడియా ముందుకు వచ్చినట్లుందని అంటున్నారు . ఎలాగూ, కొడలి నానీ, వల్లభనేని వంశీ, రోజా లాంటి వారితో పాటు – ఆయనకు కూడా అటు టీడీపీలో ఇటు జనసేనలో చేరే అవకాశం లేదు. ఆ క్లారిటీ పేర్ని నానికి కూడా ఏంది. తనతో పాటు కుమారుడి పొలిటికల్ కెరీర్ కొనసాగాలంటే ఆయన వైసీపీలో కొనసాగాల్సిందే .. అందుకే ఆయన జగన్ పట్ల విధేయత చాటుకోవడానికే తాజా విమర్శలు చేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.


Also Read: చంద్రబాబుకి తలనొప్పిగా మారిన.. తెలుగు తమ్ముళ్లు

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారితో రాజీనామా చేయింది ఆ పదవులు ఎవరికిస్తారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం అని – అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి జగన్ తప్పు చేశారు అని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని డిమాండ్ చేశారు.

కేవలం జగన్ మూలంగా ఒక మత్స్యకారుడు పెద్దల సభలో అడుగుపెట్టగలిగాడని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు.. వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు తనతో పాటు వైసీపీలో పనిచేసిన వారిపై పేర్ని నానీ చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. తన విశ్వాసాన్ని నిరూపించుకొనేందుకే అలా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా జగన్ దగ్గర కుక్కలా విశ్వాసంతో పనిచేస్తామని పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏ దిక్కూలేక వైసీపీలోనే కొనసాగాల్సి రావడంతో.. జగన్ కు విశ్వాసపాత్రుడినని నిరూపించుకొనేందుకే పేర్ని నానీ.. వైసీపీని వీడుతున్నవారిని ఉద్దేశించి అలా కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి .

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×