BigTV English
Advertisement

Coolie Movie: సూపర్ స్టార్‌ మూవీలో శృతిహాసన్.. పోస్టర్ ఏమన్నా ఉందా, అదిరిపోయిందంతే..

Coolie Movie: సూపర్ స్టార్‌ మూవీలో శృతిహాసన్.. పోస్టర్ ఏమన్నా ఉందా, అదిరిపోయిందంతే..
shrutihaasan joining the cast of Coolie as Preethi: సీనియర్ హీరోయిన్ శృతి హసన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంద, అభినయం, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ సహా ఇతర భాషల ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఆమెది ప్రత్యేక శైలి. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఘనత ఆమెదే. యంగ్ స్టార్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్‌తో సహా ఇంకా ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఎన్నో హిట్లు అందుకుంది.

అయితే కొన్నాళ్ల నుంచి ఆమెకు ఎలాంటి హిట్ పడలేదు. అంతేకాకుండా సినీ ఆఫర్లు కూడా కరువయ్యాయి. దీంతో ఆమె నుంచి త్వరలో ఎలాంటి సినిమా వస్తుందా? అని ఆమె ప్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ బడా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమాలో కీలక పాత్రలో అవకాశం అందుకుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ గాసిప్స్‌ను మేకర్స్ నిజం చేశారు.


కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే బడా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు లోకేష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్‌ మూవీతో కమల్ హాసన్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లోకేష్ ఆ తర్వాత లియో మూవీతో విజయ్ దళపతికి మరో హిట్ అందించాడు. ఇక ఇప్పుడు తలైవాతో తీస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: పుకార్లు నిజమయ్యాయి.. రజినీకి విలన్ గా నాగార్జున


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రజినీ కాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ రాబట్టాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో రజినీ స్టైల్, స్వాగ్, డైలాగ్స్ అబ్బో సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. ఈ సినిమా మొత్తం గోల్డ్ మైన్ నేపథ్యంలోనే తెరకెక్కబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇలా ఒక్క గ్లింప్స్‌తోనే లోకేష్ ఈ ‘కూలీ’ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాడు.

అయితే ఈ సినిమాలో ఒక్క రజినీయే అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు హీరోలుండే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. అందువల్లనే లోకేష్ కూడా అదే ఫార్ములాతో కూలీ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇందులో నాగ్ ‘సైమన్’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా మరో పాత్రను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో శృతి హాసన్ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీలో ఆమె ‘ప్రీతి’ పాత్రలో నటిస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×