Dil aju on Pawan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సినీ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతున్నాయి. ఇలా ఇండస్ట్రీ ప్రభుత్వానికి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇదివరకే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా నేడు మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ అవుతాయని ప్రకటన రావడంతోనే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ పై సంచలన ప్రకటన విడుదల చేశారు. జూన్ 12వ తేదీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరు మల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ అని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ అవుతాయని అధికారకంగా ఎక్కడ వెలబడలేదు అంటూ తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు తెలియజేశారు.
మీడియా వారే కారణం..
పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవడానికి మీడియానే కారణమంటూ ఈయన మాట్లాడారు. మీరు జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ అంటూ హెడ్డింగులు పెట్టి వార్తలు రాయటం వల్లే పవన్ కళ్యాణ్ గారి వద్దకు ఇది చాలా నెగిటివ్ గా వెళ్లిందని, అందుకే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారనీ దిల్ రాజు తెలిపారు. ఇలా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో మీడియా వారు దిల్ రాజుకు మరొక ప్రశ్న వేశారు . జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఎందుకని మీరు ఈ వార్తలపై స్పందిస్తూ అది అవాస్తవమని చెప్పలేదని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ.. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి వాతావరణం నెలకొందని దిల్ రాజు తెలిపారు.
సినిమాను ఆపే శక్తి నాకు లేదు…
సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చోటు చేసుకున్న ఈ అంశం కారణంగా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. ఆయన మాకు పెద్దన్నయ్యతో సమానం అన్నయ్య కోప్పడితే దానికి మేమేమి బాధపడటం లేదని, పవన్ కళ్యాణ్ ను తాను గత 22 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయనకు ఏదైనా నచ్చకపోతే కోప్పడతారని దిల్ రాజు తెలిపారు. కొంతమంది కారణంగా ఆయన వద్దకు తప్పుడు సమాచారం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప హీరో సినిమాని ఆపే అంత శక్తి నా దగ్గర లేదు అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఈ వివాదం పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఈ విధంగా దిల్ రాజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈ వివాదం పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం పూర్తిగా తొలగిపోయి యధావిధిగా థియేటర్లు రన్ అవుతాయాని, పవన్ సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఉండవని స్పష్టమవుతుంది. అదేవిధంగా సినీ పెద్దలు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.