BRS Vs Congress: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీస్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను క్యాంపు ఆఫీసులో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ తోపులాటలో కొందరికి గాయాలయ్యాయి. దీంతో పోలీసుల ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తోపులాట టౌన్ సీఐ కృష్ణ వేలికి తీవ్రగాయమైంది. అయినా గొడవ సద్దుమనగకపోవడంతో.. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సిరిసిల్లలో హైటెన్షన్..
ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
ఇరు వర్గాల మధ్య తోపులాట, లాఠీచార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/bbyrRJTTwH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 26, 2025
ఘటన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు “కేటీఆర్ డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదంతా ఒక్కసారిగా జరిగిపోవడంతో ఆ ప్రాంతమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొందది. ఇటీవల కొన్ని రోజుల నుంచి ప్రోటోకాల్ అంశం మీద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ: TDP: లోకేష్‌కు కీలక బాధ్యతలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం!
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడాన్ని వారు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టాలని పట్టుబడడంతో ఈ ఘటన తలెత్తింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ALSO READ: IOB Recruitment: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.85,920.. దరఖాస్తుకు కొంత సమయమే మిత్రమా!