BigTV English
Advertisement

Nandyal Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నంద్యాలలో తడాఖా చూపించేదెవరు..?

Nandyal Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నంద్యాలలో తడాఖా చూపించేదెవరు..?

Nandyal Assembly Constituency : ఆంధ్ర రాజకీయాల్లో నంద్యాల నియోజక వర్గ రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకం. నంది ఆలయం అన్న పేరు మీదుగా నంద్యాల అన్న పేరు వాడకంలోకి వచ్చిందంటారు. ప్రఖ్యాత మహానంది ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం నాటి నుంచి ఈ ప్రాంత రాజకీయాలు చాలా కీలకం. 1991 బై ఎలక్షన్లలో పీవీ నర్సింహారావు నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచారు. గత కొన్నేళ్లుగా నంద్యాల నియోజకవర్గం శిల్పా కుటుంబం, భూమా కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ గా మారిపోయింది. ప్రస్తత అధికార పక్షం, ప్రతిపక్షం ఈసారి ఎన్నికల్లో తగ్గేదేలేదంటూ పోటీ పోటీగా రంగంలోకి దిగుతున్నారు. మరి నంద్యాల నియోజకవర్గం ఓటరు నాడి ఈసారి ఎలా ఉండనుంది.. ఆ వివరాలు తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS భూమా బ్రహ్మానంద రెడ్డి


YCP 55%
TDP 38%
JSP 3
OTHERS 4%

2019 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పోటీ చేసి 55 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. శిల్పా మోహన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో తప్పుకుని తన కొడుకుని గత ఎన్నికల్లో నిలబెట్టి నంద్యాల నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 38 శాతం ఓట్లు మాత్రమే రాబట్టారు. జనసేనకు 3 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో నంద్యాల సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (YCP)

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • శిల్పా మోహన్ రెడ్డి వారసత్వం
  • గ్రౌండ్ లెవెల్ లో చాలా యాక్టివ్ గా ఉండడం
  • వార్డుకు పోదాం క్యాంపెయిన్

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ కు షిఫ్టింగ్
  • స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమస్య

భూమా బ్రహ్మానంద రెడ్డి (TDP)

భూమా బ్రహ్మానంద రెడ్డి ప్లస్ పాయింట్స్

  • 2019లో ఓడినప్పటికీ సెగ్మెంట్ లో యాక్టివ్
  • జనంలో పేరున్న నాయకుడిగా గుర్తింపు

భూమా బ్రహ్మానంద రెడ్డి మైనస్ పాయింట్స్

  • NMD ఫరూక్ తో విబేధాలు
  • పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహణ

NMD ఫరూక్ (TDP)

NMD ఫరూక్ ప్లస్ పాయింట్స్

  • చంద్రబాబు హయాంలో మంత్రిగా బాధ్యతలు
  • టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత
  • 40 ఏళ్ల రాజకీయ అనుభవం

NMD ఫరూక్ మైనస్ పాయింట్స్

  • క్యాడర్ ఫాలోయింగ్ అంతగా లేకపోవడం

కుల సమీకరణాలు

ముస్లిం 25%
ఎస్సీ 20%
బలిజ 17%
రెడ్డి 10%
వైశ్య 8%

నంద్యాలలో ముస్లిం వర్గం జనాభా ఎక్కువగానే ఉంది. వీరిలో వైసీపీకి 50 శాతం, టీడీపీకి 50 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. అటు ఎస్సీల్లో 50 శాతం జగన్ పార్టీగకి, 40 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో 45 శాతం వైసీపీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు. అటు రెడ్డి సామాజికవర్గంలో 60 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక వైశ్యుల్లో 55 శాతం వైసీపీ, 40 శాతం టీడీపీ, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS భూమా బ్రహ్మానంద రెడ్డి

YCP 51%
TDP 42%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 51 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, టీడీపీకి 42 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులు 7 శాతం ఓట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ సెగ్మెంట్ లో వర్గవిబేధాలు టీడీపీని దెబ్బ తీస్తున్నట్లుగా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. వైసీపీ అభ్యర్థి అటు ప్రజలతో మమేకం అవడం, ఇటు క్యాడర్ తో మంచి సత్సంబంధాలు మెయింటేన్ చేస్తుండడంతో గెలుపు నల్లేరుపై నడకే అన్నది బిగ్ టీవీ సర్వేలో జన అభిప్రాయంగా తేలింది.

శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి VS NMD ఫరూక్

YCP 52%
TDP 40%
OTHERS 8%

ఇక టీడీపీ నుంచి NMD ఫరూక్ బరిలో దిగితే పోల్ సినారియో ఎలా ఉందో చూద్దాం. వైసీపీకి 52 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉండగా, టీడీపీకి 40 శాతం ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఇతరులు 8 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. NMD ఫరూక్ సీనియర్ మోస్ట్ లీడరే అయినప్పటికీ, హైకమాండ్ మద్దతు ఉంటున్నా… భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం సపోర్ట్ లేకుండా సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేవన్నది గ్రౌండ్ లెవెల్ లో జనం అభిప్రాయంగా తేలింది.

Related News

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Big Stories

×