BigTV English
Advertisement

Udayagiri Assembly Constituency : ఉదయగిరిలో గెలుపెవరిది? సైకిల్ దూసుకుపోతుందా?

Udayagiri Assembly Constituency : ఉదయగిరిలో గెలుపెవరిది?  సైకిల్ దూసుకుపోతుందా?

Udayagiri Assembly Constituency : నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆల్ వేజ్ డిఫరెంట్. ఉదయగిరి పాలిటిక్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. తొలినాళ్లలో ఇక్కడి నుంచే రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. వెంకయ్యనాయుడుని ఆశీర్వదించి పెద్ద స్థానానికి పంపిన సెగ్మెంట్ ఇదే. ఈ సెగ్మెంట్ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు ఇదే సెగ్మెంట్ నుంచి గెలిచారు. కానీ 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని.. వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో దించబోతుంది. మరి ఈసారి ఉదయగిరి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 ఎన్నికలు
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి VS బొల్లినేని వెంకట రామారావు
YCP 57%
TDP 38%
OTHERS 5%

2019 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 57 శాతం ఓట్లు రాబట్టారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి 38 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 5 శాతం ఓట్లు సాధించారు. మరి ఈసారి ఎన్నికల్లో ఉదయగిరి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


మేకపాటి రాజగోపాల్ రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో జనంలో గుర్తింపు
  • రాజమోహన్ రెడ్డి సపోర్ట్ ఉండడం
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం

మేకపాటి రాజగోపాలరెడ్డి మైనస్ పాయింట్స్

  • రాజకీయాలకు కొత్త కావడం
  • ఉదయగిరిలో సరైన రోడ్లు లేకపోవడం సమస్య
  • ఇండ్ల ముందు డ్రైనేజ్ నీళ్లు నిల్వ ఉండడం
  • గ్రామాల్లో స్ట్రీట్ లైట్ల సమస్య
  • సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం
  • పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్ పూర్తికాకపోవడం

బొల్లినేని వెంకట రామారావు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • ఉదయగిరి జనంలో మంచి గుర్తింపు
  • సీనియర్ టీడీపీ నేతగా మంచి అభిప్రాయం
  • 2019 ఎన్నికల్లో ఓడిన సానుభూతి
  • తన హయాంలో రోడ్ల అభివృద్ధి
  • ప్రస్తుతం సెగ్మెంట్ లో క్రియాశీలంగా రామారావు

ఇక వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

మేకపాటి రాజగోపాల్ రెడ్డి VS బొల్లినేని వెంకట రామారావు
YCP 46%
TDP 48%
OTHERS 6%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉదయగిరి సెగ్మెంట్ లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి బొల్లినేని వెంకట రామారావు నిలబడితే 48 శాతం ఓట్ షేర్ రాబట్టే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి 46 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థికి లీడ్ రావడానికి కారణం… రామారావు వ్యక్తిగత ఇమేజ్, అలాగే తన హయాంలో చేసిన అభివృద్ధి కీలకంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీకి చెందిన కంభం విజయరామిరెడ్డి సపోర్ట్ కూడా రామారావుకు చాలా కలిసి వస్తోంది. దీంతో పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అటు వైసీపీ తరపున బరిలో ఉంటున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఆ కుటుంబ నేపథ్యం కలిసి వస్తోంది. ఆ కుటంబానికి ఉన్న ఫాలోయింగ్.. విధేయతతో ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి స్కీముల ద్వారా లబ్ది పొందుతున్న వారు కూడా ఓటు వేస్తామని తమ అభిప్రాయం వెల్లడించారు.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×