BigTV English

Venkatagiri Confusion in TDP: సైకిల్ సవారీకి సిద్దమైన ఆనం.. వెంకటగిరి టీడీపీ టికెట్ ఎవరికి..?

Venkatagiri Confusion in TDP: సైకిల్ సవారీకి సిద్దమైన ఆనం.. వెంకటగిరి టీడీపీ టికెట్ ఎవరికి..?

Venkatagiri Confusion in TDP(Andhra pradesh today news): కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్నట్లు తయారైంది అక్కడ టీడీపీ పెద్దల పరిస్థితి.. ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఇద్దరినీ కాదనుకోలేని సిట్యూయేషన్ అవ్వడంతో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలో తెలియక సమాలోచనలు మొదలుపెట్టింది టీడీపీ అధిష్టానం. ఒకరు లోకల్ అయిన మాజీ ఎమ్మెల్యే.. మరొకరు నాన్ లోకల్ అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది? తెలుగుదేశం అధినేత వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అలాంటి స్థితి చోటు చేసుకున్న సెగ్మెంట్ ఏదంటారా?


ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం.. భౌగోళికంగా చాలా పెద్దది.. 6 మండలాలతో నియోజకవర్గం వ్యాపించి ఉంది. వెంకటగిరి మున్సిపాలిటీ తో పాటు వెంకటగిరి రూరల్, డక్కిలి బాలయ్య పల్లి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ మండలాల్లో కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికి రెండుసార్లు కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.

ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి అసలు సమస్య వచ్చి పడింది. ఇప్పుడా ఇద్దరూ టికెట్ విషయంలో వెనక్కి తగ్గేలా లేరు. దీంతో పార్టీ అధినేత పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కల తయారైందట. ఇటు మాజీ మంత్రి అయిన ఆనం రామనారాయణరెడ్డినీ వదులుకోలేక.. అటు పార్టీలో సీనియర్ అయిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కాదనుకోలేక సతమతమవుతున్నారంట పార్టీ పెద్దలు.


తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటరిగి నియోజకవర్గంలో యాక్టివ్‌గానే ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆనం రామనారాయణ రెడ్డి స్వరం మార్చారు. తెలుగుదేశం పార్టీ పల్లవి అందుకున్నారు. వైసీపీ అధిష్టానం ఆనం రామనారాయణరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. సీనియర్ అయిన ఆ మాజీ మంత్రికి మంత్రివర్గ పునర్‌వ్యవవస్థీకరణ సమయంలో కూడా కేబినెట్ బెర్త్ దక్కకపోడంతో.. క్రమంగా స్వరం పెంచి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. సైకిల్ ఎక్కి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు అన్ని తానే వ్యవహరించారు.

ఆ క్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగోండ్ల రామకృష్ణ పోటీలో ఉంటారని సంకేతాలు వచ్చాయి. అలా లైన్ క్లియర్ అవుతుందని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిపై మమకారం చూపుతూ చేసిన వ్యాఖ్యలు దానికి కారణమయ్యాయి. ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇటీవల జరిగిన చంద్రబాబు రా కదిలిరా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కురుగొండ్ల రామకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఏకైక నేత కురుగొండ్ల రామకృష్ణే.. మరి ఇక్కడి నుంచి ఆనం రామనారాయణరెడ్డి బరిలో నిలిస్తే కురుగొండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటని ఆయన అనుచరులు మధన పడుతున్నారు.

ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పడంతో అది ఇష్టం లేని ఆనం అలకపాన్పు ఎక్కి .. టీడీపీ నేతలకు టచ్‌లో లేకుండా పోయారంట. దాంతో వెంకటగిరి టికెట్ ఆనంకే ఇస్తామని సంకేతాలు పంపారంట టీడీపీ పెద్దలు.. అప్పటివరకు డల్ గా ఉన్న ఆనం ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఇటీవల వెంకటగిరి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను కోరుకున్నట్లే నిర్ణయం వెల్లడిస్తారని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఎటువంటి సంకేతాలు లేకుండానే ఆనం అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

కురుగొండ్ల రామకృష్ణ తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వ్యక్తి కాదు.. ఇప్పటికే రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత.. మరి అటువంటి నేతను పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వెంకటగిరి తమ్ముళ్లలో కనిపిస్తోంది. మరోవైపు కురుకొండ్ల రామకృష్ణని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఆనం రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా వారిలో ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటివరకు వెంకటగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆ ఇద్దరినీ టీడీపీ పెద్దలు పిలిచి మాట్లాడలేదు. ఒకవేళ వారిద్దరనీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడితే.. ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సమష్టిగా ముందుకు సాగుతారా? పార్టీ టికెట్ దక్కని నేతను తెలుగుదేశం అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే వేచి చూడాల్సిందే.

Related News

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

Big Stories

×