
TDP latest news telugu(AP political news) :
ఏపీ రాజకీయాల్లోకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలోనే లోకేశ్ భార్య బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. దీంతోబ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టారు ఆయన సోదరి వైఎస్ షర్మిల. అలానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణి అండగా ఉండాలంటున్నారు టీడీపీ నేతలు. బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ లోకేశ్ అరెస్ట్ అయితే బ్రహ్మణి యువగళం పాదయాత్రను కొనసాగిస్తారనే చర్చ నడుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. నారా లోకేష్ సహా కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉన్నారు. పార్టీకి ఎన్నడూలేని కష్టకాలాన్ని ఎలా అధిగమించాలి? అనే అంశం చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నందమూరి బాలకృష్ణ వెళ్లారు. పార్టీ ముఖ్యనేతలలో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు.
బావ జైలుకు వెళ్లడంతో బామ్మర్ధి పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారా? పార్టీ కార్యాలయంలో బాలయ్య పార్టీ నేతలతో భేటీ వెనుక కారణమేంటన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ వార్త ఆసక్తికరంగా మారింది.