BigTV English

Kanna Lakshminarayana : వీధి లైట్లు ఆపేసి.. కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..

Kanna Lakshminarayana : వీధి లైట్లు ఆపేసి.. కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..

Kanna Lakshminarayana : పల్నాడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. స్ట్రీట్ లైట్స్ ఆపేసి.. ఇళ్లపై నుంచి మాజీ మంత్రి, టీడీపీ ఇన్‌ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. దీంతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


మరోవైపు స్టేజిపై కన్నా లక్ష్మీనారాయణకు… డీఎస్పీకి మధ్య వాగ్వాదం జరగడం చర్చనీయాంశం అవుతోంది. కార్యక్రమాన్ని ఆపాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం కొనసాగుతుందని కన్నా వారించడంతో కొద్దిసేపు వారి మధ్య ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కూడా చేసుకోకూడదా ఏమిటి ఈ దారుణం అంటు టీడీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. దాడిపై స్పందించిన కన్నా… పోలీసుల వైఫల్యమే దాడికి కారణమని అన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భయం తన బ్లడ్‌లోనే లేదన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని, సంయమనం పాటించాలని పార్టీ శ్రుణులకు పిలుపునిచ్చారు.


Related News

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Sunil Kumar Ahuja: ఏపీ లిక్కర్ కేసులో కొత్త కోణం.. సునీల్ అహూజాపై సిట్ కన్ను, ఇంతకీ వీళ్లెవరు?

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

Big Stories

×