Illu Illalu Pillalu Today Episode may 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదకు ఇచ్చిన మాట ప్రకారం సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రామరాజుకు రెస్పాండ్ అవ్వకుండా ఉండాలని అనుకుంటారు. ఇక ఇద్దరూ కలిసి రొమాంటిక్ నైట్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత సరదాగా సిటీ మొత్తాన్ని తిరగాలని అనుకుంటారు. అయితే ట్యాంక్ బండ్ దగ్గర దిగిన ఫోటోలు చూసి వాళ్ళ నాన్న సాగర్ భయపడుతూ ఉంటాడు. రెస్టారెంట్లో నర్మదా ఇదంతా ఒక ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ నాన్నకు దొరక్కుండా నాతోపాటు రెస్టారెంట్లో తిరగడం ఇదంతా నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నర్మదా ఫీలవుతుంది. నువ్వు మాట్లాడటానికి కూడా మీ నాన్న పర్మిషన్ తీసుకుంటావు అలాంటిది ఇంత దూరం ట్రైనింగ్ కోసం నాకు దగ్గరకు రావడం.. రెస్టారెంట్ కి తీసుకెళ్లాలన్నా మీ నాన్న పర్మిషన్ ఉండాలి అని అంటావు. డబ్బులు కూడా మీ నాన్న ఇవ్వాలని అంటావు. ఏది ఏమైనా కూడా ఈ మెమోరీస్ ని నేను అస్సలు మర్చిపోలేను అని సాగర్ అంటాడు. మనం దిగిన ఫోటోలు చాలా అద్భుతంగా వచ్చాయి కదా అని సాగర్ అంటాడు. అయితే సాగరు వాళ్ళ నాన్న ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు.. ఏంటి ఆలోచిస్తున్నావ్ అని సాగర్ ని అడుగుతుంది. కాదు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నా అని సాగర్ అంటాడు. మొత్తానికి ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తమ ఫోటోలు నీ ప్రేమకు చూపించాలని అంటుంది కానీ సాగర్ మాత్రం టెన్షన్ పడతాడు. ఈ ఫోటోలు అమ్మ చూస్తే పర్లేదు కానీ నాన్న చూస్తేనే నాకు తడిసిపోతుందని టెన్షన్ పడతాడు. ప్రేమకు పంపించిన ఫోటోలను శ్రీవల్లి చూస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి నర్మదా సాగర్ ని అడ్డంగా ఇరికించాలని అనుకుంటుంది. తను అనుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరినీ బుక్ చేస్తుంది. అయితే శ్రీవల్లి చేస్తున్న పనిపై అందరూ కోపంగా ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా అతని ఇన్వాల్వ్ అయ్యి కావాలని మావయ్య గారితో చెబుతుందని ప్రేమ ఫీల్ అవుతుంది. అయితే శ్రీవల్లి ప్లాను గ్రాండ్ సక్సెస్ అవడంతో వంటగదిలోకి వెళ్లి తీన్మార్ డాన్స్ వేస్తూ ఉంటుంది. రేపు నర్మదాసాగరు అడ్డంగా బుక్ అవడం ఖాయం అంటూ ఫుల్ ఖుషి అవుతు స్టెప్పులెస్తుంది. అప్పుడే ప్రేమ వంటగదిలోకి వస్తుంది. అక్క నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా.. నర్మదా అక్క వాళ్ళ ఫోటోలు మామయ్యకి చూపించమని నిన్ను అడిగారా? మరి నువ్వెందుకు చూపించావు నీకు కొంచమైనా ఉందా? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు నీకు తెలియదా? అంటూ ప్రేమ పెద్ద క్లాస్ పీకుతుంది..
ఇంట్లో జరిగే విషయాల గురించి మామయ్య గారికి చెప్పే హక్కు నాకుంది.. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కోడల్ని అని శ్రీవల్లి అంటుంది. హక్కుల గురించి మాట్లాడదగ్గ నీకన్నా ముందు వచ్చినా కోడళ్ళ మేము ఉన్నాము నువ్వు ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద పెత్తనం చెల్లాయించాలని చూస్తున్నావు ఆలోచన మానుకో.. నాకు ట్యూషన్ విషయం కూడా మావయ్యకి అదే పనిగా పని కట్టుకొని మరీ వెళ్లి చెప్పావు. నేను ట్యూషన్ చెప్పకుండా ఆపేసాను అని ప్రేమ సీరియస్గా తిడుతుంది. దానికి శ్రీవల్లి షాక్ అవుతుంది అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ఇద్దరు గొడవకు దిగుతారు.
అటుగా వెళుతున్న వేదవతి వీళ్ళ మాటలు విని అక్కడికి వస్తుంది. ఏమైంది ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అంటే.. నిన్నగాక మొన్న వచ్చిన ఈవిడ మావయ్య గారికి ఒక్కటే ఉత్తమరాలైన కోడల్లాగా అనిపించుకోవాలని చేస్తుంది. మా విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు ప్రేమ వేదవతితో అంటుంది. నువ్వు చెప్పింది కూడా బాగాలేదు కదమ్మా అని శ్రీవల్లిని వేదవతి అంటుంది. ఆవిడ మీ మేనకోడలు కాబట్టి మీరు వెనకేసుకొని వస్తున్నారు. నేను బయటి నుంచి వచ్చాను కదా అందుకే మీకు చులకన లేని అత్తయ్య గారు అని శ్రీవల్లి ఏడుస్తుంది. శ్రీవల్లి వెళ్ళగానే ప్రేమపై వేదవతి సీరియస్ అవుతుంది. నువ్వైనా చూసుకోవాలి కదా అమ్మ ఎందుకు ఇలా అంటున్నావ్ అని వెదవది అనగానే మీకు ఎంతైనా బయటి నుంచి తెచ్చుకున్న కోడలే మీకు ఇష్టం కదా అని ప్రేమ కూడా వెళ్ళిపోతుంది.
రెండు రోజులు ఒంటరిగా భార్యతో ఎంజాయ్ చేసిన సాగర్ ఆ జ్ఞాపకాల నీ నెమరు వేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లోకి రాగానే ప్రేమ వేదవతి అందరూ వాళ్ళని పలకరిస్తారు. కానీ రామరాజు ఫోన్ చేస్తాడు. అది చూడగానే సాగర్ టెన్షన్ పడతాడు.. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు రా అని రామరాజు అడుగుతాడు. నీకోసం ఇంత చేస్తున్నావ్ తండ్రి చెప్పిన మాటని కనీసం లెక్క చేస్తున్నావా నువ్వు అని నానా మాటలు తిడతాడు. రామ రాజన్న మాటలకి నర్మదా ఫీలవుతుందా? సాగర్ ఇంట్లోంచి నర్మదను తీసుకొని వెళ్ళిపోతాడా? శ్రీవల్లి ఇంకేదైనా చేస్తుందా..? చూడాలి.. నర్మదా శ్రీవల్లితో గొడవ పెట్టుకోవడం రేపటి ఎపిసోడ్లో హైలెట్గా నిలవనుంది..