BigTV English

OTT Movie: గురువు గారి రాసలీలలు … తీగలాగితే డొంకంతా కదిలే …

OTT Movie: గురువు గారి రాసలీలలు … తీగలాగితే డొంకంతా  కదిలే …

OTT Movie : నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మధ్య చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక కోర్ట్‌రూమ్ డ్రామాతో నడుస్తుంది. ఇందులో ఒక సామాన్య వ్యక్తి అయిన న్యాయవాది పి.సి. సోలంకి (మనోజ్ బాజ్‌పేయి) ఐదు సంవత్సరాలు ఒక కేసుతో పోరాడుతాడు.  అతను ఒక శక్తివంతమైన గురువు (బాబా) పై, మైనర్ బాలికపై లైం*గిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ఒక కేసు తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి వార్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఈ మూవీ ఒక సెషన్స్ కోర్టు న్యాయవాది పి.సి. సోలంకి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువుపై వ్యతిరేకంగా పోరాడుతాడు. ఒక చిన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో వచ్చిన కేసును వాదిస్తాడు. ఈ కేసు నిజ జీవితంలో అసారం బాపు కేసును గుర్తుకు తెస్తుంది. ఈ కేసులో బాబా అనుచర గుండాల బెదిరింపుల కారణంగా, సాక్ష్యాలను సేకరించడం, బలమైన వాదనలను వినిపించడం సోలంకికి సవాలుగా మారుతుంది. సాక్షులు బెదిరింపులకు గురవుతారు, కొందరు హత్యకు గురవుతారు, అయినప్పటికీ సోలంకి నీతి, నిజాయితీతో నడిచి ఈ కేసును ఎదుర్కొంటాడు. బాధితురాలి కుటుంబానికి న్యాయం అందించడానికి అవిశ్రాంతంగా పోరాడతాడు.


చివరికి సోలంకి ఆ చిన్న పాపకి న్యాయం చేస్తాడా ? దొంగ బాబాని ఎదుర్కుంటాడా ? బాబాని జైలుకి పంపిస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ కోర్ట్‌రూమ్ డ్రామా సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ మూవీలో మనోజ్ బాజ్‌పేయి నటనకు ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా ఈ మూవీ 2023 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులలో 7 నామినేషన్లను అందుకుని, 5 అవార్డులను గెలుచుకుంది. వీటిలో ఉత్తమ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (మనోజ్ బాజ్‌పేయి) ఉన్నాయి.

Read Also : కొత్త కాపురంలో చిచ్చు పెట్టే దెయ్యం … ఇలా భయపెట్టిస్తూనే అలా పిల్లాడు మాయం … గుండెల్లో గుబులు పుట్టించే హారర్ థ్రిల్లర్

జీ5 (Zee 5) లో

ఈ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ పేరు ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandana kaafi Hai). 2023 లో హిందీలో విడుదలైన ఈ సినిమాకు అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి, విశాల్ గుర్నాని, విశ్వంకర్ పఠానియా దీనిని నిర్మించారు. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్, అద్రిజా సిన్హా, సూర్యమోహన్ కులశ్రేష్ఠ, ప్రియాంక సెటియా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా జీ5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×