E-Paper
Advertisement

భోగాపురంలో ఎయిర్‌పోర్ట్.. ఇలాగైతే వైజాగ్ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా?

భోగాపురంలో ఎయిర్‌పోర్ట్.. ఇలాగైతే వైజాగ్ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా?
Advertisement

Bhogapuram Aiport: భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోందా? వైసీపీ తన ఇమేజ్ ఇంకా డ్యామేజ్ చేసుకుంటోందా? ఈ విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తోందా? తాజాగా విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో నెట్టేశాయా? ఇంతకు ఆయన ఏమన్నారు?

భోగాపురంలో ఎయిర్‌పోర్టుపై కొత్త రగడ

భోగాపురం ఎయిర్‌పోర్టు పునాద రాయి మొదలు ఏదో ఒక రగడ కంటిన్యూ అవుతోంది. ఏ ప్రభుత్వం హయాంలో ఎయిర్‌పోర్టు శంకుస్థాపన జరిగిందో.. మళ్లీ ఆ ప్రభుత్వంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. మరో 12 రోజుల్లో రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ దాదాపు దశాబ్దం పాటు ఎయిర్‌పోర్టు చుట్టూ రకరకాల రాజకీయాలు లేకపోలేదు. దీని క్రెడిట్ విషయంలో అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. దీన్ని నుంచి బయటపడేందుకు వైసీపీ మరొక కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి హాట్ కాెమంట్స్

Advertisement

సోమవారం విశాఖలో మాట్లాడిన ఆయన, విశాఖ అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే..  అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్‌లో మ్యాప్ చూస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖకు ఎయిర్‌పోర్టు లేదన్నారు. సిటీకి 58 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు ఉందని దీనికి చంకలు గుద్దుకోవడం ఏంటని ప్రశ్నించారు. అవును.. మా అధినేత అన్నట్లు అక్కడ ఎర్రబస్సు దిగదని చెప్పుకొచ్చారు. వాసుపల్లి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాఖ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా?

ఎయిర్‌పోర్టు లేకుంటే విశాఖ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావా? క్రెడిట్ చోరీ వర్కవుట్ కాకపోవడంతో ఆ తరహా వ్యాఖ్యలతో ఆ పార్టీ కాలక్షేపం చేస్తోందా? అసలు ఎయిర్‌పోర్టుకు-యువత పెళ్లిలకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నవారు కొందరు. ఇదేం లాజిక్క్ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.  ఓ వైపు ఎయిర్‌పోర్టు మా హయాంలో అనుమతులు వచ్చాయని వైసీపీ చెబుతోంది. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోందన్నది ఆ పార్టీ నేతల మాట.  భూసేకరణ విషయంలో అప్పుడు వాసుపల్లి గణేష్ వైసీపీలో ఉన్నారు. ఆనాడు జగన్‌తో ఎయిర్‌పోర్టు లేకుంటే విశాఖ యువతకు పెళ్లిళ్లు జరగవని ఎందుకు విబేధించలేదన్న కామెంట్స్ రైజ్ అవుతున్నాయి.

హైదరాబాద్‌వాసులు ఆ మాట అనలేదే?

Advertisement

అభివృద్ధిలో భాగంగా బేగంపేట నుంచి శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టు వెళ్లింది. ఈ రెండు రెండింటి మధ్య దూరం దాదాపు 30 కిలోమీటర్లు. ఆనాడు ఎవరూ హైదరాబాద్‌లో విమానాశ్రయం లేదని, పెళ్లిళ్ల కోసం విమానాశ్రయం లేదని ఎవరూ అనలేదు. భోగాపురం విశాఖకు దూరమే అయినా దానికి సంబంధించి అన్నిరకాల సదుపాయాలు సదరు నిర్వాహకులు కల్పించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వస్తే సంతోషించాల్సింది పోయి చకబారు కామెంట్స్ ఏంటన్న విమర్శలు సొంత పార్టీ నుంచి పడిపోతున్నాయి. మొత్తానికి క్రెడిట్ అంశం నుంచి డైవర్ట్ కావడానికి కొత్త పల్లవిని ఎత్తుకుని అడ్డంగా బుక్కయ్యారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.

ALSO READ: డ్వాక్రా మహిళలకు ఊరట.. రూ.25 వేలకు పైగానే, ఆనందంలో సంఘాలు

Related News

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

Big Stories

Advertisement
×