YCP Fourth List : వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం జగన్ రేసు గుర్రాల జాబితాలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత 9 మందితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్‌సభ స్థానానికి ఇంచార్జులను బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే.. గతంలోలాగే.. ఫోర్త్ లిస్ట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. 9 మందితో విడుదలైన నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
YCP Fourth List(AP news today telugu):
వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం జగన్ రేసు గుర్రాల జాబితాలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత 9 మందితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్‌సభ స్థానానికి ఇంచార్జులను బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే.. గతంలోలాగే.. ఫోర్త్ లిస్ట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. 9 మందితో విడుదలైన నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మడకశిర ఎమ్మెల్యే మోపురగుండు తిప్పేస్వామికి ఈ సారి మొండిచేయే మిగిలింది. ఇక మరో ఇద్దరికి స్థాన చలనం చేశారు. గత ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి పోటీచేసి గెలిచిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఈ సారి చిత్తూరు లోక్‌సభ బరిలో దించనున్నారు. ఎంపీగా ఉన్న రెడ్డెప్పను గంగాధర నెల్లూరు ఇన్‌చార్జిగా నియమించారు.
ఇప్పటి వరకూ వైసీపీ నాలుగు జాబితాలు విడుదల చేసింది. అందులో 10 మంది ఎంపీ అభ్యర్థులు, 58 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 4 జాబితాల్లో 28 సిట్టింగులకు సీటు దక్కలేదు. ఇక మిగిలిన స్థానాల్లో కూడా మార్పులు అదేస్థాయిలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గెలిచే అవకాశం లేని వారికి నిర్మొహమాటంగా టికెట్ లేదని సీఎం జగన్ చెప్పేస్తున్నారని తెలుస్తోంది.
ప్రతిపక్షాలు మాత్రం బీసీ, ఎస్సీలకే మొండిచేయి చూపిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు సీటు దక్కలేదు. అందులో నలుగురు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో.. బీసీ, ఎస్సీలనే జగన్ టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ట్రోల్ చేస్తోంది.